Category తెలంగాణ

అసెంబ్లీ దగ్గర ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : అసెంబ్లీ దగ్గర జ‌రిగిన‌ ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని, వారిపై చర్యలకు సంబంధించిన రిపోర్టును స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించి ఉంటే అది స్పీకర్ అధికార పరిధిలోకి…

100 రోజుల్లో 60 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం

– సయ్యద్ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి కేంద్రీకృత వంటశాల – సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.9.60 కోట్లు  – మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యవేక్షణ సూర్యాపేట/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థులకు రోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సూర్యాపేట…

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ కార్యాచరణ

– ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం – గెలుపు లక్ష్యంగా కీలక సన్నాహక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ (ఫామ్-18) అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల క్షేత్రంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బీజేపీ…

రేపు కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన

– ఏర్పాట్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం సమీక్ష – నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన…

తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవ‌కాశాలు 

– పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలి  –  అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఫ్రాంక్‌ఫర్ట్(జర్మనీ), సెప్టెంబర్ 29 : రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, గ్రేటర్ హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చెప్పారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిందని ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్…

పప్పుధాన్యాల సాగు వృద్ధిలో రెండో స్థానం

– రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి తుమ్మల – క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలి – పామాయిల్ ధరపై కమిటీ వేస్తామన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 29 : పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల…

సెటిల్ మెంట్ సీఐల బదిలీ

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇన్ స్పెక్టర్ ల (సిఐ)  బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని మల్టీ జోన్-1 ఐజీ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం పలువురు సిఐలను బదిలీ చేయగా, ముఖ్యంగా ఖమ్మం నగరంలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న వారికి స్థానచలనం…

‘బీసీ ఓవర్సీస్ విద్యానిధి’ దరఖాస్తు గడువు పెంపు

– 30 నుంచి అక్టోబర్ 15 వరకు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : విదేశాలలో ఉన్నత విద్య (మాస్టర్స్/డాక్టరేట్) అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం (ఆగస్టు/సెప్టెంబర్ 2026-ఫాల్ సెషన్) దరఖాస్తుల గడువును పొడిగించారు. గతంలో చివరి తేదీగా నిర్ణయించిన ఈనెల…

ఆగిన చదువును కొనసాగించండి

– ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి – మ‌హిళ‌ల‌కు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహిళలు ఏ కారణంతోనైనా తమ చదువును మధ్యలో ఆపేసి ఉంటే మళ్లీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను ఆర్థికంగా మాత్రమేకాక విద్య,…