హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : ఎస్‌ఐఆర్ అనేది ఓటరు జాబితాను స్వచ్ఛంగా, పారదర్శకంగా, కచ్చితత్వంతో రూపొందించేందుకు చేపట్టే సాధారణ ఎన్నికల ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. మల్కాజ్‌గిరి బీజేపీ కార్యకర్తల ఎసఐఆర్ వర్క్‌షాప్‌లో ఆయన ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నాయన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త అత్యంత గంభీరతతో, బాధ్యతతో ఈ ప్రక్రియలో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. డిటెక్టు, డిలీట్, డీపోర్టు స్ఫూర్తితో ఈ ప్రక్రియ ద్వారా అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారులను గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు కూడా దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మహేందర్, జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





