హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. అరుణ్ స్వస్థలం మహబూబ్‌నగర్. ప్రస్తుతం ప్లోరిడాలోని టెంపాలో నివసిస్తోన్న అతడు స్టెమ్ ఓపీటీలో ఉన్నాడు. ఫుల్ టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోన్న అరుణ్ ఈనెల 19న ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





