Category ఎడిటోరియల్

సంక్షేమానికి చట్ట రక్షణ అవసరం!

కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ అమ‌లుపై స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేయ‌డంతో ఈ ప‌థ‌కాల అమ‌లును కొన‌సాగించ‌డానికి ఏర్ప‌డిన అడ్డంకి  తొల‌గిపోయింది. సెప్టెంబర్ 1న తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల డివిజన్ బెంచ్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది జీఓల అమలును నిలిపివేసిన సింగిల్ జడ్జి మధ్యంతర…

హస్తిన బాటలో హస్తం నేతలు: విస్తరణా.. ప్రక్షాళనా?

కీలకమైన మలుపునకు దిల్లీ వేదిక కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ బృందం హైకమాండ్‌తో భేటీ మాములే అయినప్పటికీ ఈ సారి దిల్లీ వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కేవలం ఖాలీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ (మంత్రివ‌ర్గ‌ విస్తరణ) మాత్రమే…

కోర్టులు, కమిషన్లు చెబితేనే కదులుతారా?

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీ హెచ్ ఆర్‌సీ) సుమోటోగా స్పందించి విచారణ చేపట్టడం ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నది . నిజానికి గతంలో విద్యార్థులే పాఠశాల సౌకర్యాల కోసం న్యాయవ్యవస్థను ఆశ్రయించిన అంశాన్ని ప్రజాతంత్ర ప్రస్తావించింది; ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ రాష్ట్రవ్యాప్త సమీక్ష…

రాష్ట్రంలో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ సంక్షోభం!

తెలంగాణ విద్యా రంగం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా ఫీజు రీఇంబర్స్ మెంట్  స్కాలర్‌షిప్‌ బకాయిలు పేరుకుపోవడం విద్యా వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నది. నిరుపేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకం, నేడు నిధుల కొరత, ప్రభుత్వాల…

నిర్భయంగా సాగుతున్న దందా… నిర్లజ్జగా నిఘా?

Telangana Infant-Sale Racket

తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పసిబిడ్డల అమ్మకాల ముఠాల ఉదంతంపై తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసిన ఆందోళన అత్యంత తీవ్రమైనది, ఆలోచింపజేసేది. సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన 3 నుండి 9 ఏళ్ల పసిపిల్లల అమ్మకాల ఉదంతాన్ని విచారించిన ధర్మాసనం, ఇది కేవలం ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితమైన సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఒక…

ఆక్రమణలు తొలగించాలి… పౌరుల హక్కులను కాదు

హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడం కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయ అండదండలు, అధికారుల నిర్లక్ష్యం, రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలు కలిసి నగర సహజ వనరులను కబళించాయి. వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) లక్ష్యం అవసరమైనదే. కానీ ఎంత గొప్ప లక్ష్యంతో ఏర్పడిన సంస్థ అయినా చట్టానికి…

అధికార్ల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు అవ‌సరం!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని అంజయ్యనగర్–కొండాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ఆగస్ట్ 22న కుప్పకూలడం, ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. నగరంలో ఒక అక్రమ కట్టడం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిది  కాకపోవొచ్చు. అయితే, ప్రతి ప్రమాదం తర్వాత వినిపించే అధికారిక ప్రకటనలు, కారణాలు…

ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన విద్యార్థులు!

రాష్ట్ర  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 20 వేల  మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, బాలురు–బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి కనీస సౌకర్యాల లేమిపై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవాలని పోస్టుకార్డులు/లేఖల ద్వారా విజ్ఞప్తి చేయ‌డం రాష్ట్ర విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను, విద్యార్థుల ఆవేద‌న‌ను స్ప‌ష్టం చేస్తున్నది . ఉపాధ్యాయుల కొరత,…

ఉద్యోగ ర‌హిత వృద్ధి శ్రేయ‌స్క‌రం కాదు!

Jobless growth is not beneficial!

తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకున్న నాటి నుంచి దేశ ఆర్థిక పటంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీఎస్‌పీ) సుమారు రూ. 17.82 లక్షల కోట్లకు చేరి, స్థిరమైన 10.7 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దీనితో పాటు రాష్ట్ర తలసరి…