Category ఎడిటోరియల్

వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్న ‘దత్తత’ దందా!

తెలంగాణ రాష్ట్రంలో పసిబిడ్డలు, చిన్నారుల అక్రమ దత్తత, మానవ అక్రమ రవాణా అంశాన్ని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 22న స్వయంగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (సూమోటో) స్వీకరించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ అక్రమ నెట్‌వర్క్‌ల విస్తృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.…

‘ఒత్తిడి’ చట్టానికి ప్రత్యామ్నాయం కాదు!

పోలీసులకు నేరాలను నిరోధించే అధికారం ఉంది. నిందితులను విచారించే బాధ్యత ఉంది. అవసరమైన సందర్భంలో అరెస్టు చేసే అధికారమూ ఉంది. కానీ ఈ అధికారాలన్నీ రాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాల ఆదేశాలకు లోబడే ఉండాలి. ఎవరి ఒత్తిడో, ఎవరి ఆదేశమో, కేసు తీవ్రత పేరుతోనో చట్టం నిర్దేశించిన హద్దులను దాటడానికి పోలీసులకు స్వేచ్ఛ లేదు. తెలంగాణ హైకోర్టు…

తెలంగాణ యువత ప్రతి నలుగురిలో ఒకరు ఖాలీ నే: ‘నీట్’ ముఖచిత్రం!!

One in Four Youths in Telangana Is Unemployed: The ‘NEET’ Snapshot

కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన మొట్టమొదటి జిల్లా స్థాయి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే  నివేదిక ప్రకారం, తెలంగాణలో 15 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతలో దాదాపు 26.2% నుండి 26.5% మంది ఎటువంటి చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ లేకుండా ‘‘నీట్’’  (NEET — Not in Employment, Education…

గ్లోబల్ హెల్త్-టెక్ లీడర్‌గా హైదరాబాద్‌!

తెలంగాణ సమాజం నూతన సాంకేతిక, పారిశ్రామిక విప్లవంలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది .తెలంగాణ ప్రభుత్వం వైద్య విజ్ఞానం, సాంకేతికతను జోడించి గ్లోబల్ హెల్త్-టెక్ రంగంలో అగ్రభాగాన నిలిచేందుకు నూతన వ్యూహాత్మక విధానాలను అమలు చేయడమే ఇందుకు కారణం. టీ-హబ్ వేదికగా, ఏఐ సిటీ, లైఫ్ సైన్సెస్ రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులు వైద్య పరిశోధనలు, స్టార్టప్…

భూ రికార్డుల గందరగోళం!

తెలంగాణ సమాజంలో భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు అది ఆత్మగౌరవం, జీవనాధారం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం సామాన్య రైతును, పట్టణ మధ్యతరగతి భూయాజమానులను  తీవ్ర అశాంతికి గురి చేస్తున్నది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి పోర్టల్’ లోని ప్రాథమిక లోపాలు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని…

రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా ఎందుకీ ధరల సెగ..?

తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో, ఐటీ రంగ విస్తరణలో దూసుకుపోతుందని పాలకులు గర్వంగా ప్రకటిస్తుంటారు. కానీ, అదే తరుణంలో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరల పెరుగుదలలోనూ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . జాతీయ సగటు కంటే తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎందుకు నిరంతరం ఎక్కువగా ఉందనే అంశంపై ఇప్పుడు క్షేత్రస్థాయిలో ముమ్మర…

భూ కబ్జాల ఆరోపణల పై పౌర సంఘాలు స్పందించాలి 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భూమి, వనరులు, ఆత్మగౌరవం అత్యంత ప్రధానమైన అంశాలు. స్వరాష్ట్రంలో ప్రజల సంపదకు రక్షణ లభిస్తుందని, బలహీనుల హక్కులకు భరోసా ఉంటుందని ప్రజలు ఆశించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రాజకీయ ప్రముఖుల చుట్టూ భూ కబ్జా ఆరోపణలు పునరావృతమవుతుండటం ఆందోళనకరం. అధికారంలో ఉన్నవారు ప్రత్యర్థుల భూ వ్యవహారాలను బయటపెడతామని…

ప్రభుత్వ వైద్యంలో తీరని ‘ఎంఆర్ఐ’ లోటు!

తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ‘డయాగ్నోస్టిక్ గ్యాప్’ (రోగ నిర్ధారణ లోపం) తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . రాష్ట్ర అసెంబ్లీలో ఆరోగ్యశాఖ స్వయంగా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, సుమారు 3.8 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 9 ఎంఆర్ఐ  యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని అర్థం ప్రతి 42 లక్షల…

లోతుకుంట తీర్పు నేర్పిన పాఠం!

హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా! ప్రారంభంలో ఈ సంస్థ చేపట్టిన కొన్ని చర్యలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, తదుపరి కాలంలో దాని పనితీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తాజాగా సికింద్రాబాద్ / లోతుకుంట ప్రాంతంలోని 40 ఎకరాల…