Category ఎడిటోరియల్

ఈసీ విశ్వసనీయతకు ‘సుప్రీం’ పరీక్ష!

భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, సర్వోన్నత ఎన్నికల కమిషన్ (ఈసీ) లోపల నిర్ణయాధికారాల పంపిణీకి సంబంధించిన అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్న సోమవారం సుప్రీంకోర్టు ముందుకు వొచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న…

భయంకరమైన ఆర్థిక సునామీ.. ?

“భయంకరమైన ఆర్థిక సునామీ  రాబోతుంది, ధరలు పెరుగుతున్నాయి , ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీ జీవితంలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం భారతదేశంలో రానుంది..” దేశ ప్రజలనుద్దేశిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జూన్ నెలలో హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి.  “రాబోయే నెలల్లో పెద్ద ఎత్తున ఆహార సంక్షోభం తలెత్తే…

ఆందోళన కలిగిస్తున్న కరువు

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని ఎట్టకేలకు ప్రభుత్వమే గుర్తించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, 235 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని రాష్ట్ర మంత్రివర్గం నిర్ధారణకు వొచ్చింది. నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని…

ర్యాంకులు కాదు… ఫలితాలు ముఖ్యం!

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 29న ప్రారంభించిన ‘ప్రగతి-50’ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపిక కావడం హర్షణీయం. ఇది కేవలం ర్యాంకుల కోసం కాకుండా, సాంకేతిక పర్యవేక్షణ ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన పారిశుధ్య ఫలితాలు సాధించాలి . ఈరెండు నగరాల్లో అప్పుడప్పుడూ నిర్వహించే క్లీన్నెస్ డ్రైవ్ల వల్ల…

గ్లోబల్ వేదికలపై తెలుగు మహిళా తేజాలు!

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన శాండీ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీ (స్ట్రాత్‌ఫీల్డ్) మేయర్‌గా ఎన్నిక కావడం కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు; అది అంతర్జాతీయ వేదికపై తెలుగువారి ప్రాతినిధ్యానికి దక్కిన గౌరవం. వ్యాపార, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, విదేశీ రాజకీయాల్లోనూ తెలుగు మహిళలు తమ జెండాను పాతడం ఒక చారిత్రక పరిణామం. అమెరికా, బ్రిటన్,…

రాష్ట్రాన్ని చుట్టుముడుతున్న కరువు నీడలు!

Shadows of Drought Looming Over the telangana State!

తెలంగాణ రాష్ట్రంలో కరువు రక్కసి మళ్లీ కోరలు చాస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 621 మండలాలకు గాను ఏకంగా 230 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న వార్తలు క్షేత్రస్థాయిలో ఉన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు ఇప్పటికే వందలాది తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి కేంద్ర సాయం…

భూ ఆక్రమణల వివాదాల్లో మూగబోతున్న నేతన్నల భవితవ్యం!

ఒకవైపు సిరిసిల్ల నేతన్నలు తమ సమస్యలకు పరిష్కారం లభించక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో, గత పాలనలో సిరిసిల్ల పరిధిలో దాదాపు 8,000 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల హస్తగతమయ్యాయని,  2016–2023 మధ్య సుమారు 8 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌, సీలింగ్ మిగులు భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయ్యాయని,అందులో…

ప్రజల నెత్తిన ‘ఫిరాయింపు’ ఉప–ఎన్నిక భారం!

తెలంగాణ రాజకీయ యవనికపై హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన వేదికగా మారింది. ఒక ప్రజాప్రతినిధి స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య విలువలను, వోటర్లను తీర్పును కాలరాస్తూ చేసిన పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఆఖరుకు న్యాయస్థానాల ద్వారా ఉపఎన్నికకు దారితీసింది. రాజకీయ నైతికతకు, వ్యవస్థల జవాబుదారీతనానికి ఈ పరిణామం…

భద్రమైన ప్రయాణానికి భరోసా…’టీజీ-టిమార్స్‌’

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ, రహదారి, రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందికి తెస్తూ ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ను ఈనెల 24న జి.ఒ.ఎం.ఎస్. నెం.135 ద్వారా ఏర్పాటు చేయడం అభినందనీయమైన పరిణామం.…