Category ఎడిటోరియల్

పోర్ట‌ల్ మారిందంతే…పాట్లు త‌ప్ప‌డంలేదు!

తెలంగాణా హై కోర్ట్ 22-ఎ కింద నిషేధిత భూముల జాబితాలో వ్యవసాయ భూములను చేర్చడంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించ‌డ‌మే కాదు, పారదర్శకత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను నిలిపివేయడంపై వివరణ కోర‌డం తాజా ప‌రిణామం.  ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారుల తప్పుల…

ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను హ‌క్కుగా మార్చాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న, ఈ విద్యా సంవత్సరం నుంచి ₹2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ముందుగానే నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే విద్యార్థులకు మొత్తం అందేలా వ్యవస్థ రూపొందిస్తామని, ఇప్పటికే ₹250 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇది అమలైతే తెలంగాణ ఉన్నత…

వివాదాల సుడిగుండంలో భూముల వేలం!!

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి, విధానపరమైన చర్చకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత ఖరీదైన రాయదుర్గ్ పన్మక్త ప్రాంతంలో, సర్వే నంబర్ 83/1 పరిధిలోని 10.63 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న…

సంక్షేమం పౌరుల హక్కు కావాలి!

Welfare Should Be a Right of Citizens, Not a Political Favour!

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర స్టే రాష్ట్రంలో ఒక సరికొత్త, అత్యంత ఆవశ్యకమైన చర్చకు తెరతీసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా నిలిచిన ఈ పథకాలు ప్రజాదరణ పొందినప్పటికీ, న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలు కేవలం ఈ రెండు పథకాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ప్రజల…

ప్రభుత్వానికి పదవీ విరమణల గండం!

తెలంగాణలో అధికారం మారినా… అప్పుల తిప్పలు, ఆర్థిక సందిగ్ధతలు మాత్రం మారలేదు సరేకదా, మరింత జటిలంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్నికల లబ్ధి కోసం గుప్పించిన ఆరు గ్యారెంటీల అమలు భారం, మరోవైపు గత ప్రభుత్వ హయాం నుండి వారసత్వంగా వొచ్చిన అప్పుల ఊబి ప్రస్తుత పాలకుల మెడకు చుట్టుకుంటున్నది . ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు…

‘రోహిత్ వేముల బిల్లు’ ఒక చారిత్రక అవసరం!!

The 'Rohith Vemula Bill' is a historical necessity!!

విద్యాలయాలు  కేవలం అక్షరాలు నేర్పే నిలయాలు మాత్రమే కాదు, అవి ఒక సమాజం ప్రగతిని, సంస్కృతిని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలాలు. అయితే, ఆధునిక కాలంలో కూడా మన ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల్లో నేటికీ వేళ్లూనుకుపోయిన అదృశ్య వివక్ష, అసమానతలు ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తును, వారి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక…

సీఈసీ నోటీసులు అందుకోనున్న 62ల‌క్ష‌ల మంది!

పలు వివాదాలు , అభ్యంతరాల మధ్య దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వివిధ దశలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన వోటర్ల సవరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వోటరు జాబితా నుంచి 73 లక్షల పేర్లు తొలగిపోనున్నాయన్న వార్త రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. బీఎల్‌వో ఇంటికొచ్చినప్పుడు ఫారం నింపి ఇచ్చి, రసీదు భద్రంగా దాచుకుని, నిశ్చింతగా ఉన్నామనుకుంటున్న  2.64 కోట్ల మందిలో…

ఉచిత పథకాల హామీ, అమలు పై మళ్ళీ చర్చ

ఎన్నికల సందర్భంగా వోట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల  హామీలు .. వాటి అమలు  పై గత కొంత కాలంగా చర్చ జరుగుతున్నది. ఉచిత పథకాల హామీ అమలు ప్రభుత్వ ఖజానా పై భారీ భారం పడుతుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.. బ్యాంక్ ల నుండి దేశ జనాభాలో అతి స్వల్ప…

ఒంటరి పోరుకు బీజేపీ నిర్ణయం !!

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరిగానే బరిలోకి దిగుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు బీజేపీ సొంతంగా బలపడటం కంటే మిత్రపక్షాలపైనే ఎక్కువగా ఆధారపడిందనేది కాదనలేని చారిత్రక సత్యం.…