- టిక్కెట్ల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరణ
- రేవతి కుటుంబాన్ని ఆదుకోని అల్లు అర్జున్
- ఆ కుటుంబానికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్21: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.
అలాంటివాటికి అనుమతులు ఇవ్వబోమని అన్నారు. టికెట్ల రేట్ల పెంపు నకూ అనుమతివ్వబోమని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హాని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదన్నారు. శ్రీతేజ్ వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.