prajatantra_news

prajatantra_news

నిజామాబాద్‌కు పంగనామాలు

– ఇచ్చిన హామీలను పట్టించుకోని రేవంత్ – తలెత్తుకోలేకపోతున్న పీసీసీ చీఫ్ – ఎంపీ అరవింద్ విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 18: నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు, భూగర్భ డైనేజీ హామీలు ఏమయ్యాయ‌న్నారు. ఈ హామీలు…

బండి భగీరథపై అదనపు సెక్షన్లు

– మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై అదనంగా బీఎన్‌ఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్‌ను దర్యాప్తు అధికారులు జత చేశారు. దీని ప్రకారం నేరం రుజువైతే పదేళ్లకు మించి జైలు…

ఇమ్రాన్ పదవీచ్యుతిలో అమెరికా పాత్ర?

– సంచలనం కలిగిస్తున్న తాజా వార్తలు ఇస్లామాబాద్, మే 18: ప్రపంచ దేశాలపై తన పట్టును కొనసాగించేందుకు అమెరికా చేయని పనులు లేవు. దానికి సలాం అనకుంటే ఆయా దేశాలను అతలాకుతలం చేస్తుంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇలా విలవిల్లాడినవే. మన దేశంలోనూ వేలు పెట్టబోయి చేతులు కాల్చుకుందని చెబుతారు. తాజాగా పాక్‌లోనూ…

భూమి కోసం అక్కను హత్య చేసిన తమ్ముడు

సూర్య‌పేట‌, ప్ర‌జాతంత్ర‌, మే 18 :  ఆస్తి కోసం సొంత అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. సురుగి అంజమ్మ భర్త మరణించడంతోపాటు పిల్లలు లేకపోవడంతో తన స్వగ్రామమైన తుమ్మల పెన్‌పహాడ్‌ లో చెల్లెలు వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తనను చూసుకుంటున్న చెల్లెలికి…

సింపుల్ ఈ-గవర్నెన్స్‌తో మెరుగైన సేవలు

– సీఎస్‌లకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ సోమనాథన్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టి.వి.సోమనాథన్ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సింపుల్…

ఆరు గిరిజన మ్యూజియంలు రాష్ట్రానికి గర్వకారణం

– గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ఇతర రాష్ట్రాలలో సాధారణంగా ఒక్క గిరిజన మ్యూజియం మాత్రమే ఉండగా తెలంగాణలో ఆరు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ బి.ఎమ్ అన్నారు.…

కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం

– ఆయనతోపాటు 20 మంది మంత్రులు కూడా – రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య, డీకే, భట్టి హాజరు తిరువనంతపురం, మే 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం జరిగిన  20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం…

కరుణాకర్ లేరనే భావన బాధాకరం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బీజేపీ సీనియర్ నాయకుడు జి.ఆర్.కరుణాకర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ మలక్‌పేట్ నియోజకవర్గ కన్వీనర్ నుండి హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన…

ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండాలి

– కార్యకర్తలకు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఉద్బోధ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తల పాత్రపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ మూడు అంశాలపై నాయకులు, కార్యకర్తలు…

సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

– ప్రమాదాల సమయంలో ‘గోల్డెన్ అవర్‌’ కీలకం – భారీ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం, వీలైనంత వరకూ ఆస్తులకు నష్టం కలగకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…