మరింత పటిష్టంగా భారత్-నార్వే బంధం

– ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారం
– ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్
– నార్వే పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటన

న్యూదిల్లీ, మే 18: భారత్-నార్వే సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే స్వచ్ఛ ఇంధనం, సముద్ర రంగం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌కు మద్దతుగా నిలిచినందుకు నార్వే ప్రభుత్వానికి మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అస్థిరత పెరుగుతున్న సమయంలో భారత్-యూరప్ భాగస్వామ్యం మరింత కీలకమైందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణలో భారత్, యూరప్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్-ఈయూ మధ్య చారిత్రక ఒప్పందంతో భారత్, నార్వేకు అనేక ప్రయోజనాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందన్నారు. ఇస్రో-నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదిరిందని, పరిశోధనల కోసం నార్వే సహాయం తీసుకుంటామని తెలిపారు. నార్వే సంస్థలు భారత్‌లో గ్రీన్ ఎనర్జీ, షిప్పింగ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు. అలాగే ఆర్కిటిక్ పరిశోధనలు, అంతరిక్ష రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో కూడా భారత్-నార్వే కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *