సూర్యపేట, ప్రజాతంత్ర, మే 18 : ఆస్తి కోసం సొంత అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. సురుగి అంజమ్మ భర్త మరణించడంతోపాటు పిల్లలు లేకపోవడంతో తన స్వగ్రామమైన తుమ్మల పెన్‌పహాడ్ లో చెల్లెలు వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తనను చూసుకుంటున్న చెల్లెలికి తన పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని అంజమ్మ నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అక్క, తమ్ముడు మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదం కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తనకు కాకుండా చెల్లెలికి భూమి ఇస్తానని అంజమ్మ చెప్పడంతో తమ్ముడు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సుమారు 6:45 గంటల సమయంలో అంజమ్మ కరువు పనులకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన తమ్ముడు పదునైన కత్తితో పలుమార్లు దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిసింది. ఘటనతో తుమ్మల పెన్‌పహాడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


