prajatantra_news

prajatantra_news

39కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 4: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఇటీవల జరిగిన దుర్ఘటనలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 39కి చేరింది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్‌రావు అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భీవమ్‌రావ్‌ స్వస్థలం మహారాష్ట్ర. పోస్టుమార్టం అనంతరం అతని…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

మరిపెడ, ప్రజాతంత్ర, జులై 4: మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్‌ సమీపంలో జాతీయ రహదారి 563పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ లారీ, కోళ్ల దానా బస్తాల లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో చెలరేగిన మంటల్లో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. స్థానికులు…

రోశయ్య విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన వివిధ హోదాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,…

9న అఖిల భారత సమ్మె

సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3 : మోదీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు కార్మిెక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచిచ్చాయి ఈ మేరకు రైతు ఉద్యమ వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు విలేకరుల…

అధికారికంగా రోశయ్య జయంతి

సీఎం రేవంత్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారన్నారు. శుక్రవారం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తమ…

మేనిఫెస్టో అమలుకు బీజేపీ కట్టుబడి ఉండాలి

తెలంగాణలో కాల్పుల విరమణ అమలు చేయాలి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: ‘పాకిస్తాన్‌తో నైనా శాంతి చర్చలు జరుపుతాము కానీ ఆదివాసీలతో, వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపము’ అనే మోదీ-షా ప్రభుత్వ వైఖరిని ఖండిరచాలని భారత కమ్యూనిస్టు…

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

~ ఎల్బీ స్టేడియంలో రేపు భారీ బహిరంగ సభ ~ గాంధీ భవన్‌లో కీలక సమావేశాలు ~ ఘన స్వాగతం పలికిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం తదితరులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు సీఎం…

మాజీ సీఎం కేసీఆర్‌కు అనారోగ్యం

‌చికిత్స కోసం యశోదాలో చేరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 3: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గురువారం ఆయన సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.  కొద్ది రోజులుగా కెసిఆర్‌ ‌సీజనల్‌ ‌జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. గురువారం ఎర్రవల్లిలోని ఫామ్‌ ‌హౌస్‌…

విభజన అంశాలపై మౌనం ఎందుకో?

రాహుల్‌పై కేటీఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్‌ గాంధీ సాధించిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. 2014 విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఏ రోజూ మోదీ ప్రభుత్వాన్ని రాహుల్‌ నిలదీయలేదని, తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణ…

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి

~ గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 3: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగనున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్…