prajatantra_news

prajatantra_news

ముగ్గురిని కబళించిన జెనరేటర్‌ పొగ

చెన్నై : ఓ పోర్టబుల్‌ జెనరేటర్‌ ముగ్గురి ప్రాణాలు తీసిన ఉదంతమిది. ఆ ముగ్గురూ తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్‌ తన ఇద్దరు కొడుకులు…

ఏసీబీ విచారణకు అర్వింద్‌ కుమార్‌ హాజరు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ మూడోసారి ఏసీబీ విచారణకు గురువారం హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో నిధుల బదలాయింపులో ఆయన కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేస్తూ కేబినెట్‌ అనుమతి లేకుండా…

21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూదిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి జరగనున్నాయి. సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు. ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగుతాయని, స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవన్నారు. కాగా, ఈ సమావేశాలు జూలై 21…

తెలంగాణ జన సమితి సూచనలు స్వీకరిస్తా

తనను కలిసిన నేతలతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) బృందం బుధవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో సీఎంను కలిసిన ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి…

గ్లోబల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఏఐగా తెలంగాణ

ఎమర్జింగ్‌ టెక్నాలజీ కాదు.. అవకాశాల గని ‘మార్పు’ను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ రెండేళ్లలో రెండు లక్షల మంది ఏఐ నిపుణులు ‘తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను అత్యుత్తమ ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని…

పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేపట్టాలి: ఓవైసీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 38 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. మృతుల్లో ఎక్కువగా జార్ఖండ్‌కు చెందిన…

17న రైలురోకో చేసి తీరుతాం

ఖమ్మంలో పోస్టర్‌ ఆవిష్కరించిన కవిత ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 2: బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 17న రైలు రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు.…

14న తిరుమలగిరికి సీఎం రాక

– తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ – ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు – ఎస్‌ఎల్‌బీసీ పనుల పునఃప్రారంభానికి కృషి – ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ నెల 14న…

రాష్ట్రానికి తగిన యూరియా కేటాయించండి

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రాష్ట్రానికి సరిపడేంత యూరియాను కేటాయించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జగత్‌ ప్రకాశ్‌నడ్డాకు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి లేఖలు…

జిల్లా అభివృద్ధికి సహకరిస్తా

ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి హామీ నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నల్గొండ జిల్లా అబివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల…