సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3 : మోదీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు కార్మిెక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచిచ్చాయి ఈ మేరకు రైతు ఉద్యమ వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు విలేకరుల సమావేశం ఏర్చాటు చేశారు. ఎస్‌కేఎం సీనియర్ జాతీయ నాయకులలో ఒకరైన వడ్డే శోభనాద్రీశ్వరరావు(మాజీ ఎంపీ, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి), నాయకులు విస్షా కిరణ్‌కుమార్, టి.సాగర్, భిక్షమ్, వి.ప్రభాÛకర్, జక్నుల వెంకటయ్య తదితరులు మీడియాను ఉద్ఱేశంచి మాట్లడారు. రైతులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఎంఎస్‌పీ నిర్ణయించకుండా, ఇపుడు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం (ఎన్‌పీఎఫ్‌ఎఎం)లో ఎంఎస్‌పీ ఊసే లేకుండా చేసి ధరల స్థిరీకరణ నిధిని అటకెక్కించి మోదీ ప్రభుత్వం రైతుల పంటలకు న్యాయమైన ధరలు కల్పించకపోగా ఆదానీ వంటి కార్పారేట్ల చేతిలో భారత వ్యవసాయాన్ని కట్టబెడుతున్నదని విమర్శించారు. అంతేగాక రైతుల పంట రుణాల బకాయలను రద్దు చేసి రైతులు అప్పుల ఊబిలో పడకుండా నివారించే రైతు ఋణ విమోచన చట్టం చేయాలని దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నా వినిపంచుకోకపోగా కార్పొరేట్లకు పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందని, గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన హుక్కులకు విఘాతం కలిగించే చట్ట సవరణలు చేయటమే కాక, ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది ఆదివాసీలను చంపవేస్తూ అటవీ సంపదను టటుటబడిదారులకు కట్టబెడుతూ, దీర్ఘకాలంగా ఐక్య పోరాటాలతో కార్మిక వర్గం సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర కోడ్‌లను తెచ్షి కార్మిక హుక్కులను, ప్రయోజనాలను పారిప్రశామిక వేత్తలకు కట్టబెట్టిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపంచారు. ‘‘ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 9న అఖిల భారత సమ్మె, దేశవ్యాప్త నిరసన కార్యకమాలు చేప్ట్లట్టాని కంప్రద్ కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన ఉమ్మడి పిలుపును విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కన్వీనరు తెలిపారు.