మరిపెడ, ప్రజాతంత్ర, జులై 4: మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ, కోళ్ల దానా బస్తాల లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో చెలరేగిన మంటల్లో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం
