~ గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు
జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 3: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగనున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే అంతర్జాతీయ కార్మిక సమాఖ్య, గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ (జిఓఏ) సంయుక్తంగా మూడు రోజుల వలస కార్మికుల సదస్సు నిర్వహిస్తున్నది. కార్మికుల వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్న ఆసియా, గల్ఫ్ దేశాల పరిస్థితులపై చర్చ జరుగుతుందని రాజిరెడ్డి తెలిపారు. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, గల్ఫ్ దేశాల ప్రతినిధులు… కార్మికులను పంపే దేశాలు, ఉద్యోగాలు ఇచ్చే దేశాల మధ్య సమన్వయం గురించి ప్రత్యక్ష చర్చలు జరుపుతారని తెలిపారు.