సవాళ్లను ఎదుర్కోవడంలో భారత వాయుసేన దిట్ట

  • సరిహద్దుల్లో వాయుసేన సేవలు అనిర్వచనీయం
  • ప్రజాపాలన విజయోత్సవాల్లో వాయుసేన ప్రదర్శన అద్భుత ఘట్టం
  • భారతవాయుసేన, సూర్యకిరణ్‌ ‌బృందం సేవలు స్ఫూర్తి దాయకం
  • ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం వైమానిక ప్రదర్శన
  • మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో ఏరోబాటిక్‌ ‌టీం కెప్టెన్‌ ‌సూర్యకిరణ్‌ ‌బృందం కెప్టెన్‌ అజయ్‌ ‌సారథి భేటి
  • కెప్టెన్‌గా తన అనుభవాలను పంచుకున్న మంత్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 :   అం‌కిత భావంతో దేశ సరిహద్దుల్లో భారత వాయుసేన అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కోవడంలో వాయు సేన పోషిస్తున్న పాత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.  ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ట్యాన్క్ ‌బండ వద్ద భారత వాయుసేన,సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం ప్రదర్శించిన వైమానిక విన్యాసాలు అద్భుత ఘట్టంగా ఆయన అభివర్ణించారు  భారత వాయుసేన, సూర్యకిరణ్‌ ‌బృందం సేవలు వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు వారి దేశభక్తి, వారు చూపించే ధైర్యసాహసాలు, నిబద్ధత అనిర్వచనీయమని అన్నారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం కెప్టెన్‌ అజయ్‌ ‌సారధి తన బృందం సభ్యులతో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

భారత వాయుసేనలో యుద్ద విమాన పైలెట్‌ ‌గా పనిచేసిన ఉద్విఘ్న క్షణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పాకిస్థాన్‌, ‌చైనా సరిహద్దుల్లో మిగ్‌-21,‌మిగ్‌ 23 ‌వంటి అడ్వాన్సడ్ ‌యుద్ద విమానాలను నడుపుతూ దేశభద్రతకు పని చేయడం గర్వకారణంగా ఉందన్నారు. భారత వాయుసేనకు సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం గర్వకారణంగా నిలుస్తోందన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ప్రదర్శనలు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిందన్నారు. సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందాన్నీ ప్రతి భారతీయుడు ప్రేరణ పొందాలని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. యుద్ద విమానాలు నడిపడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ అం‌దించిన సేవలు విశిష్టమైనవని సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం కెప్టెన్‌ అజయ్‌ ‌సారథి తెలిపారు. ధైర్యం, ఖచ్చితత్వం, నిష్ఠతో కూడిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి భారత వాయుసేన దృఢ సంకల్పానికి ఈ ఐకాన్‌ ‌గా నిలిచిపోతారని ఆయన కొనియాడారు. 2019 నుంచి 2023 వరకు పార్లమెంట్‌ ‌లో రక్షణ శాఖ కోసం వేసిన పార్లమెంటరీ కమిటీలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రక్షణ శాఖ సిబ్బంది సంక్షేమంతో పాటు పదవీ విరమణ పొందిన వారి కోసం పాటు పడ్డారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page