గణేష్‌ మండపంలో గుండెపోటుతో టెకీ మృతి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16 : హైదరాబాద్‌లోని మణికొండ పరిధి అలకాపురి టౌన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ గుండెపోటుతో మృతిచెందారు. టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన గణేష్‌ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొన్న అతడు.. ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయ‌డు .

ఆదివారం రాత్రి గణేష్  మండపం వద్ద శ్యామ్‌ ఉత్సాహంగా లడ్డూ వేలంలో పాల్గొన్నారు. చాలాసేపు నృత్యాలు చేస్తూ గడిపారు. రూ.15 లక్షల వరకు వేలం పాడారు. ఆ తర్వాత స్నేహితుడు లడ్డూను కైవసం చేసుకోవడంతో అతడి ముందు ఉత్సాహంగా తీన్మార్‌ స్టెప్పులేశారు. అనంతరం ఇంటికి వెళ్లి కుప్పకూలి చనిపోయారు. దీంతో కుటుంబసభ్యులు, కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *