మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద వారు అంజలి ఘటించారు. దేశం, స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.