- వికసిత భారత్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
- మూడో టర్మ్‌లో ..మూడురెట్ల వేగంతో అభివృద్ధి
- 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు
- 3కోట్ల మంది పేదలకు ఇల్లు నిర్మించబోతున్నాం
- కృత్రిమ మేధ రంగంలో ‘భారత ఏఐ మిషన్’
- ప్రయాగ్‌రాజ్ తొక్కిసలాట ఘటన విచారకరం
- పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందని, మన ముందున్న ఏకైక లక్ష్యం.. వికసిత్ భారత్’ నిర్మాణమే అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. భారత సామాజిక చేతనకు మహా కుంభ మేలా నిదర్శంగా నిలుస్తోందన్నారు. తమ ప్రభుత్వ మూడో టర్మ్‌లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోందని రాష్ట్రపతి తెలిపారు. ఆరంభంలో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేలాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శ్రద్దాంజలి ఘటించారు. ‘మహా కుంభమేలా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించుకుంటున్నాం. ఇటీవల గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం‘ అని రాష్ట్రపతి హర్షం వ్యక్తంచేశారు.
బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఉంటుందని ఆమె తెలిపారు. మూడోసారి అధికారంలోకి వొచ్చిన ఎన్డీయే సర్కారు.. గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడు రెట్లు వేగంతో పనిచేస్తోంది. త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకొచ్చాం. అర్హులందరికీ లబ్ది చేకూరేలా సంక్షేమ పథకాలను వేగంగా అమలుచేస్తున్నాం అని అన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం. అదనంగా మూడు కోట్ల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పొడిగించామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద.. 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తోంది. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఒకే దేశం-ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఒలింపిక్ పతకాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారు.
వారి సాధికారతకు కృషి చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవల కల్పనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారికత కల్పిస్తున్నాం. 3 కోట్ల మందిని లక్‌పతీ దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ప్రారంభించాం. కృత్రిమ మేధ రంగంలో ’భారత ఏఐ మిషన్’ను మొదలుపెట్టాం. భారత్ తన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదు. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాలు, ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు దేశంలో అన్ని రంగాల్లో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి. మన యూపీఐ లావాదేవీల వ్యవస్థ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రశంసించాయి. భారత మెట్రో నెట్‌వర్క్ 1000 కిలోటర్ల మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది.
ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా 1.75లక్షల ఆరోగ్య మందిర్‌లను ఏర్పాటుచేశాం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం వారు ఉపయోగించే పలు ఔషధాలపై కస్టమ్ సుంకాన్ని రద్దు చేశాం. గర్భిణులు, పిల్లల వ్యాక్సినేషన్ కోసం యు-విన్ పోర్టల్‌ను ప్రారంభించాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందిస్తున్నాం. కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు రూ.2000 కోట్లతో ’మిషన్ మౌసం’ను ప్రారంభించాం. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగయ్యాయి. సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రత కోసం ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. వామపక్ష అతివాదానికి వ్యతిరేకంగా పోరాటం చివరి దశకు చేరింది. నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కు తగ్గింది. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక అడుగులు వేస్తున్నాం అని రాష్ట్రపతి అన్నారు. బడ్జెట్-2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నాం. 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. అటల్ టన్నెల్, సోన్మార్గ్ టన్నెల్ వంటివి నిర్మించాం. భారత మెట్రో నెట్‌వర్క్ 1000 కిలోటర్ల మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది.భావితరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం. చ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు రూ.2000 కోట్లతో మిషన్ మౌసంను ప్రారంభించాం అని వివరించారు. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు ప్రధాని మోదీ సహా అధికారపక్ష సభ్యులు బల్లలు చరిచారు. అంతకుముందు రాష్ట్రపతి సంప్రదాయ పద్దతిలో పార్లమెంట్‌కు చేరుకోగానే ఉప రాష్ట్రపతి ధన్కడ్, స్పీకర్ ఓంబిర్లాలు స్వాగతం పలికారు.