పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

న్యూదిల్లీ, నవంబర్‌ 25 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ ఓం‌బిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
దీంతో ఎగువ సభను చైర్మన్‌ ‌ధన్‌కర్‌ ‌బుధవారానికి వాయిదా వేశారు. ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 20 ‌వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (‌సవరణ) సహా 16 బిల్లులను  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్‌ ‌హింస, గౌతమ్‌ అదానీ అవినీతి చర్యలపై యూఎస్‌ అరెస్ట్ ‌వారెంట్‌, ‌దిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page