తృణమూల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

– పార్టీ బ్యాంక్‌ ‌ఖాతాల ఫ్రీజ్‌పై అత్యవసర విచారణకు నో

కోల్‌కతా, జూన్‌ 30 : ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్‌ ‌ఖాతాల ఫ్రీజింగ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. టీఎంసీ బ్యాంక్‌ ‌ఖాతాల నిలిపివేత కారణంగా పార్టీ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని, తక్షణ విచారణ అవసరమని ఆ పార్టీ తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ అంశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంటూ కోల్‌కతా హైకోర్టు వెంటనే విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. ఈ కేసును విచారించిన జస్టిస్‌ అమృతా సిన్హా  సాధారణ లిస్టింగ్‌ ‌పక్రియ ప్రకారమే పిటిషన్‌ ‌విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యల నేపథ్యంలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన పలు బ్యాంక్‌ ‌ఖాతాలు స్తంభించిపోయాయి. ఖాతాలు ఫ్రీజ్‌ ‌చేయడం వల్ల ఆ పార్టీ రోజువారీ కార్యకలాపాలు, ఉద్యోగుల చెల్లింపులు, సంస్థాగత వ్యయాలు, రాజకీయ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల వినియోగంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీఎంసీ న్యాయవాదులు వాదించారు. అయితే హైకోర్టు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడంతో టీఎంసీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు విచారణకు వచ్చే వరకు ఆ పార్టీ నేతలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కోల్‌కతా హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్న తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకత్వం, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్‌ ‌రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసు రెగ్యులర్‌ ‌విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *