అసోంలో భారీ ఆపరేషన్‌

– అ‌క్రమంగా తరలిస్తున్న 37 కిలోల బంగారం స్వాధీనం

గౌహతి,జూన్‌ 30 :అస్సాం పోలీసులు భారీ ఆపరేషన్‌ ‌చేపట్టారు. అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న 37 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.55 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బహుశా అస్సాం పోలీస్‌ ‌చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో బంగారం సీజ్‌ ‌చేసిన ఘటన ఇదే కావొచ్చని డీసీపీ శాంభవి మిశ్రా తెలిపారు. గువాహటిలో అక్షయ్‌ ‌బన్సోడే (32) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఈ ఆపరేషన్‌ ‌చేపట్టాం. 24 క్యారెట్ల బంగారు కడ్డీలతో పాటు దాదాపు 13 గ్రాముల బరువు ఉన్న వెండి ముక్కలు స్వాధీనం చేసుకున్నాం అని ఆమె తెలిపారు.  ఈ ముఠాకు అంతర్జాతీయ గోల్డ్ ‌స్మగ్లింగ్‌ ‌ముఠాతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదొక భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ‌ముఠాకు సంబంధించినదిగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. బన్సోడే గతంలో మూడుసార్లు 20 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించాడని, తాజాగా నాలుగోసారి తరలిస్తుండగా పట్టుబడినట్లు పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *