– 11 ఏళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు
ముంబై, జూన్ 30 : ముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద చెట్టు స్కూల్ బస్సుపై కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఓ స్కూల్ బస్సు చెంబూర్ రోడ్ నంబర్ 11లో వెళుతుండగా పెద్ద చెట్టు కూలి బస్సుపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ఉన్నారు. చెట్టు బస్సుపై పడగానే బస్ కండక్టర్, స్థానికులు వేగంగా స్పందించారు. ధ్వంసం అయిన బస్సు నుంచి పిల్లలను బయటకు తీసుకువచ్చారు. గాయపడ్డ ఐదుగురిని చెన్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, ముంబై బ్రిగేడ్‌కు సమాచారం వెళ్లింది. పోలీసులు,ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలెట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ అనే బాలుడు జెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మిగిలిన ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఘటన గురించి తెలియగానే ముంబై మేయర్ రీతూ తావ్‌డే జెన్ హాస్పిటల్‌కి వెళ్లారు. బాధితులను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రీతూ తావ్‌డే మాట్లాడుతూ.. ’ఈ సంఘటన ఎంతో బాధాకరం. నేనో తల్లిగా ఇక్కడికి వచ్చాను. పిల్లల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ స్కూల్ బస్సులో ప్రమాదం జరిగినపుడు 13 మంది ఉన్నారు. వారిలో 12 మంది క్షేమంగా బయటపడ్డారు. ఓ బాలుడు మృతి చెందాడు అని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





