కాంగ్రెస్‌ పార్టీ వొస్తే మళ్ల కరెంటు కష్టాలు

ఇన్వర్టర్లు, జనరేటర్లకు పని
ఎన్నికలు మూడు రోజుల పండగ కాదు…ఐదేళ్ల భవిష్యత్తు
కెసిఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు
నిజామాబాద్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తే కరెంట్‌ కష్టాలు మళ్లీ వొస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వొస్తుందని మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. శనివారం నాడు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సంజీవయ్య కాలనీలో మంత్రి హరీశ్‌రావు రోడ్‌ షోలో  మంతి హరీష్‌ రావు విూడియాతో మాట్లాడుతూ..‘‘ఎన్నికల అనగానే మూడు రోజుల పండగ కాదు ఐదేళ్ల భవిష్యత్తు. తెలంగాణ రాక ముందు మన పరిస్థితి ఎలా ఉండేది గులాబీ జెండా వొచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందనేది గ్రహించాలి. వోటు అనేది తలరాతలు మార్చేది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి. 200 ఉన్న పింఛన్లు వేయి చేశాడు. ఫ్రీగా ఉన్న పెన్షన్‌ 2000 పెన్షన్‌ చేశాడు. రెండువేల పెన్షన్‌ 5000 చేస్తా అంటున్నాడు. కేసీఆర్‌ వొచ్చిన తర్వాత మంచినీళ్ల కష్టాలు తీరాయి. ప్రభుత్వ హాస్పిటల్‌ని కేసీఆర్‌ వొచ్చిన తర్వాత అభివృద్ధి చేశారు. కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి తల్లి బిడ్డను ఇంటికాడ దించారు. నిజామాబాద్‌లో మోకాలు చిప్ప ఆపరేషన్లు చేశారు. కొరోనా వొచ్చిన తర్వాత అందరినీ కడుపులో పెట్టి కాపాడుకున్నాం. కరోనా ఉన్నప్పుడు గణేష్‌ బిగాలా కాకుండా ఇంకా ఎవరు కనబడ్డారు. హాస్పిటల్‌ని బాగు చేయడానికి నాతో కొట్లాడి బాగు చేశాడు. నీ కష్టం వొచ్చినప్పుడు ఎవరు నీ తరఫున నిలబడ్డాడు అనేది ఆలోచించాలి.

దొడ్డు బియ్యం కాకుండా..ఇప్పటి నుంచి సన్నబియ్యమే ఇస్తున్నామన్నారు. మహిళల కోసం కల్యాణలక్ష్మి, గృహలక్ష్మి కేసీఆర్‌ కిట్టు న్యూట్రిషన్‌ కిట్లు వొచ్చాయి. ప్రస్తుతం సౌభాగ్య లక్ష్మి పథకం తెచ్చాడు.ఒక్క మంచి పని అన్న బీజేపీ నేతలు చేశారా. ముస్లింలు హిందువుల పంచాయతీ తప్ప ఒక్క మంచి పని అన్న చేశారా. పేదల కోసం బీజేపీ చేసిన మంచి పని ఒక్కటైనా ఉన్నదా..? 400 ఉన్న సిలిండర్‌ని 1500 చేశారు. మన ప్రభుత్వం రాగానే 400కు గ్యాస్‌ సిలిండర్‌ని ఇస్తాం. కోటి కుటుంబాలకు బీమాను ప్రవేశపెట్టబోతున్నాం. పిల్లలను చదువుకోడానికి మైనార్టీ, ఎస్సీ , ఎస్టీ, బీసీ కళాశాలలను పెట్టాం. డిగ్రీ కళాశాలను ప్రవేశపెట్టబోతున్నాం. నిజామాబాద్‌ నగరం నాటికి నేటికి ఎంత మారింది. ట్యాంక్‌ బండ్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కన్నుల పండుగగా చేసింది. కాంగ్రెస్‌ ఉన్నప్పుడు అన్ని ఇన్వర్టర్‌లో ఉండేవి. బెంగుళూరు పట్టణాల్లో కరెంటు లేదు.. రాహుల్‌, ప్రియాంక గాంధీ నమ్మి వోట్లు వేస్తే కర్ణాటక నడిరోడ్డు విూదకు వొచ్చింది. కర్నాటక రాష్ట్రం ఆగమాగం అయిపోయింది. కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం.

నిజామాబాద్‌ జిల్లా కేసీఆర్‌కు అండగా నిలబడిన జిల్లా. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ మేమే ఇచ్చినమని ఇప్పుడు మాట్లాడుతున్నారు. 2001లో ఇచ్చి ఉంటే పిల్లలు బతికే వాళ్లు కదా. బ్రిటిష్‌ వాళ్లు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారా పోరాడి తెచ్చుకున్నాం. దిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కేసీఅర్‌ ఆశీర్వదిస్తే ఇంకా ముందుకు పోతాం. కేసీఆర్‌కు వోటు వేస్తే బాగుపడతాం. కాంగ్రెస్‌కు వోటు వేస్తే బాధపడతాం. కాంగ్రెస్‌ పార్టీ కాకమ్మ కథలు చెబుతుంది. వాటిని నమ్మతే తెలంగాణ కథ కంచికైతది. కేసీఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు.తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్‌ వస్తదా..? తెలంగాణకు మూడోసారిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. షబ్బీర్‌ అలీ కామారెడ్డిలో ఓడిపోయి గెలిచేటట్టు లేనని నిజామాబాద్‌ వొచ్చాడు. అక్కడ చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా..? మా ఎమ్మెల్యే కామారెడ్డిలో ఉంటాడని చెప్పుకుందామా..? వొచ్చినప్పుడు గణేష్‌ గుప్తా ఎమ్మెల్యే అయితా అని రాలేడు తెలంగాణ కోసం వొచ్చాడు. పదవుల కోసం రాలేదు. గణేష్‌ గుప్తా హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే కాబోతున్నాడు.. మంచి భవిష్యత్తు ఉంటది. కాంగ్రెస్‌ పార్టీకి వోటేస్తే బీజేపీకి మంచి జరుగుతుంది’’ అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page