– ఆ బాధ్యత సర్పంచులదే
– ‘జలసిరి’లో చెక్ డ్యాములు, కుంటలు, బోర్ రీఛార్జ్ లకు ప్రాధాన్యమివ్వాలి
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క
– విబిజి రామ్ జి పథకంపై సమీక్ష
ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 23: ప్రతి సర్పంచ్ తన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దు కోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ములుగు కలెక్టరేట్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ ర్ అండ్ ఆజీవిక మిషన్ (వి బి జి రామ్ జి) పథకం కింద చేపట్టాల్సిన పనుల కార్యాచరణ ప్రణాళి. కపై మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మా ట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేదని, అందుబాటులో ఉన్న నిధులను వినియో గించుకోవాలన్నారు. ఎల్ నినోను దృష్టిలో ఉంచుకొని ఉపాధి కూలీలకు విస్తృతంగా పనులు కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు అందేలా ఎంపీడీవోలు చొరవ చూపాలన్నారు. ప్రతి 40 మంది ఉపాధి కూలీలకు ఒక మేట్‌ను ఏర్పాటు చేసి కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆదే శించారు.గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు చేపట్టాలని, మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి నిర్మాణాలు పూర్తి చేయించాలని సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని సూచించారు. జలసిరి కార్యక్రమం కింద ఊట కుంటలు, నీటి కుంటలు, కట్ట కుంటలు, బోర్ 6w = 6 పనులతోపాటు చెక్ డ్యాముల నిర్మాణాన్ని కూడా చేర్చినట్లు తెలిపారు. గ్రామాల భౌగోళిక పరిస్థితులకు అనుగు ణంగా చెరువులు, కుంటల పూడికతీత, చెక్
డ్యాముల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, కాలువల త వ్వకం, పాఠశాలల నిర్మాణం, ప్రహరీ గోడలు, అంగన్వాడీ భవనాలు, షెడ్ల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
మారుమూల తండాలు, గూడేలు, దళితవాడ లు, అటవీ గ్రామాల్లో నివసించే అర్హులకు పింఛ న్లు, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో సర్పంచులు స్వయంగా పరిశీలించాల న్నారు. జిల్లాలో కనీసం ఐదు నుంచి ఆరు గ్రా మపంచాయతీలను జాతీయ స్థాయిలో గు ర్తింపు పొందే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల ని మంత్రి ఆకాంక్షించారు. గ్రామపంచాయతీ లు అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక సదుపా యాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయి పురస్కారాలను అందుకునేలా కృషి చేయాల న్నారు. డిసెంబర్ నుంచి మే, జూన్ వరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేప ట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామాభి వృద్ధిని ప్రతిబింబించేలా ప్రత్యేక పేరు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ కమిషనర్ దిశానిర్దేశం
హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని సర్పంచులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీబీ-జీ రామ్ జీ పథకం కింద అనుమతించబడిన 375 రకాల పనులపై సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, వీబీ-జీ రామ్ జీ జాయింట్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్ హైదరాబాద్ మోరె శ్రీనివాస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్లు బైరెడ్డి భగవాన్ రెడ్డి, గుమ్మడి సోమయ్య, డీఆర్డీఓ చంద్రశేఖర్. డీపీఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





