– 26న మద్దిమడుగులో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
– ఆలయ ప్రాంగణం, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి
– బంజారా సోదరులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు
నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, నవంబర్ 23 బంజారా సమాజ ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవ ర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్దిమడుగులో మహత్తర ఆలయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షే మ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బంజారా సమాజ ఆత్మగౌరవానికి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు, విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు ఈ ఆలయం ప్రతీకగా నిల వనుందని మంత్రి తెలిపారు.
ఈనెల 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం మంత్రి అడ్లూరి మద్దిమడుగును సందర్శించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేత్రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, గిరిజన ఎమ్మెల్యే బాలు నాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సబ్ కలెక్టర్ సలోని చాబ్రా. అధికా రులతో కలిసి ఆలయ ప్రాంగణం, ముఖ్య మంత్రి బహిరంగ సభ నిర్వహణకు సంబం ధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పా ట్లపై సమీక్షించారు. సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశా లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ము ఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలకు, భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయా లని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువుగా, గొప్ప సామాజిక మార్గదర్శిగా చిరస్థాయిగా నిలిచారని తెలిపా రు. సమాజంలో ఐక్యత, సద్భావన, నైతిక విలువలు, సేవాభావాన్ని పెంపొందించేందు కు ఆయన చేసిన బోధనలు నేటికీ ఎంతో ప్రాసంగికమని పేర్కొన్నారు.
మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం చేపట్టడం బంజారా సమా జం యొక్క ఆధ్యాత్మిక ఆకాంక్షలకు గౌరవం కల్పించడమేనని తెలిపారు. ఈ ఆలయం భవి ష్యత్తులో బంజారా సమాజానికి ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు, వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేసే వేదికగా నిలుస్తుందని అన్నారు.
గిరిజన సమాజాల చరిత్ర, సంస్కృతి, సంప్ర దాయాలను గుర్తించి గౌరవించడం ప్రభు త్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి హక్కులను పరిరక్షించడం, అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధా న్యతల్లో భాగమని స్పష్టం చేశారు.
గిరిజనుల సామాజిక గుర్తింపు, గుర్తిం రాజ్యాంగబద్ధ హక్కుల సాధనలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయని మంత్రి గుర్తుచేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో 1976లో పార్లమెంట్ ఆమోదించిన ఎస్సీ, ఎస్టీ జాబితాల సవరణ చట్టం ద్వారా అప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సుగాలీలు, లం బాడీలను ఎస్టీ జాబితాలో చేర్చే చట్టపరమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. అనంతరం 1977లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో గిరిజనులు, రైతులు, యువతతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి తెలిపారు. గిరిజనుల భూముల పరిరక్షణ, విద్య, ఉపాధి, సామాజి క న్యాయం, హక్కుల సాధన వంటి అంశాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గిరిజనుల విద్య, ఆర్ధిక, సామాజిక అభివృద్ధితోపాటు వారి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. గిరిజన సమా జాలు అభివృద్ధిలో భాగస్వాములుగా ఎదగడంతోపాటు తమ ప్రత్యేక సంస్కృతి, సంప్ర దాయాలను కాపాడుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ నెల 26న మద్దిమడుగులో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బంజారా సోదరులు, గిరిజన ప్రజాప్రతినిధులు, భక్తులు, సేవాలాల్ మహారాజ్ అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మద్దిమడుగు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగాలని, సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ప్రార్థించారు. అనంతరం అచ్చంపేట పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




