ఆయుధం అనివార్యమని తెలుసు…!!

ఆయుధం అనివార్యమైన చోట
అస్త్ర సన్యాసం వట్టిమాట
రాయపూర్‌ ఎడతెగని చర్చంతా
నీ దోపిడీ కోసమే
మమ్మల్ని నిర్మూలించేందుకు
నీ కుప్పిగంతులు
ఐదుదశాబ్దాల క్రితమే
నక్సల్బరీ వసంత మేఘ ఘర్జనకు
మా చేతుల్లో ఆయుధాలు చిగురించాయి
మా నోళ్ళల్లో ప్రజాకవుల పాటలు పల్లవించాయి
కోరన్న మంగన్న వెంపటాపు
పంచాది పాణిగ్రాహిల
అమరత్వమే మమ్మల్ని సాయుధం చేసింది
రాజ్య హింసనేలిన నాటి నుంచే
ప్రజ ప్రతిహింసనేలుతుంది
ఏనాడో ఆయుధం మాదేహంలో భాగమైంది
ఇప్పుడు ఆయుధం
మా స్నేహితుడు
మా సహచరి
మా రక్షణకవచం
ఆయుధం పడగనీడలో
అధికారం చలాయిస్తున్న పాలకుడా
అస్త్రం తోడు లేకపోతే
అడుగేయలేని పిరికివాడివి
నీకు అణిచివేతకు ఆయుధం
మాకు ఆత్మరక్షణకు ఆయుధం
నీ రాజ్య యంత్ర నిర్వహణదారి
ఆయుధం
మాకు రాజ్యాధికారం కోసం ఆయుధం
పీడకుల భక్షణకు భరోసా నీ బందూక్‌
‌పీడితుల రక్షణకు రణభేరీ మారైఫిల్‌
‌తుపాకి గురిపెట్టడంలో
నీ లక్ష్యం నీది
మా లక్ష్యం మాది
నీ దోపిడి కోటలో జరిపే చర్చలతో
మమ్ము నిర్మూలించలేవని చేరలేవని తెలుసు
రాయపూర్‌ ‌మధనంమాటల వరకే
నీకుట్ర దాటవని తెలుసు
అందుకే ఎప్పటికైనా
ఆయుధం అనివార్యమని తెలుసు
                                   – శోభరమేష్‌
8978656327
‌కాకతీయ విశ్వవిద్యాలయం
(రాయపూర్‌ ‌లో అంతర్‌ ‌రాష్ట్రాల సదస్సులో వామపక్ష తీవ్రవాదాన్ని 2026 నిర్మూలిస్తామన్న ప్రకటనకు నిరసనగా )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page