ఆమె కోర్టులో
నా వాక్యం బోనులో
ప్రవేశపెట్టబడింది
క్షమించలేని ఇష్టం
శిక్షింపదగ్గ నమ్మకం
లిఖింపలేని భావం
దండించదగ్గ లోతు
సాక్ష్యాలుగా
బలమైన నా మనసుపై
తీవ్ర వాదోపవాదనలు జరిగాక…
అనివార్య పరిస్థితిలో
ఆ ఒక్క వాక్యానికి
మౌనమనే
మరణశిక్ష విధిస్తూ
తీర్పు వెలువడింది.





