Take a fresh look at your lifestyle.

ఆం‌ధ్రులను అవమానించిన కెసిఆర్‌ ఎలా వస్తారు

  • విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేయగలడా
  • అన్యాయం చేస్తున్న బిజెపిపై పోరాటం చేస్తారా
  • ఇరు రాష్ట్రాల విభజన సమ్యలను ముందే పరిష్కరిస్తారా
  • ప్రత్యేకహోదా సాధనసమితినేత చలసాని డిమాండ్‌

‌విశాఖపట్టణం,జనవరి10 : తెలంగాణ ఉద్యమసమయంలో కెసిఆర్‌ ఆం‌ధ్రులను అనరాని మాటలు అన్నారని, ఆ విషయాన్ని కెసిఆర్‌ ‌మరచిపోయినా ఆంధ్రులు మరవలేదని ప్రత్యేక హోదా విభజన హాల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఆనాడు ఇష్టం వచ్చినట్లుగా ఆంధ్రలును తూలనాడారని అన్నారు. హీనంగా మాట్లాడారని అన్నారు. అయినా ఆంధ్రరప్రదేశ్‌ ‌కలసి ఉండాన్న ఒకేఒక కోరికతో మిన్న కున్నామని అన్నారు. అలాంటి కెసిఆర్‌ ఇప్పు‌డు ఏ మొహంతో ఇక్కడకు వస్తారని అన్నారు. ఆనాడు చేసిన అవమానాలను కెసిఆర్‌ ‌మరచిపోయినా ప్రజలు మరచిపోలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ‌మాటలకు… గాయపడని ఆంధ్రుడు ఉండరని అన్నారు. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతే. సీఎం కేసీఆర్‌ ఏపీలోకి అడుగుపెట్టాలన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌, ‌జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌పై కూడా చలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ముందుగా ఏపీ, తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి కేసీఆర్‌ ‌చొరవ చూపాలన్నారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయంపై బీఆర్‌ఎస్‌  ‌పోరాడగలదా చెప్పాలని ప్రశ్నించారు. స్టీల్‌ ‌ప్లాంట్‌  ‌పరిరక్షణ కోసం విశాఖలో సీఎం కేసీఆర్‌ ‌దీక్ష చేయాలని కోరారు. ఉమ్మడి ఆస్తుల విషయంలో సీఎం కేసీఆర్‌ ‌పట్టు విడుపులు చూపాలని చలసాని శ్రీనివాస్‌ అన్నారు. బీజేపీ చెర నుంచి జనసేన పార్టీ బయటకు రావాలని చలసాని శ్రీనివాస్‌ ‌సూచించారు. పవన్‌ ‌కల్యాణ్‌కు పోరాట పటిమ ఉందని, దేనికీ లొంగరని తెలుసునని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజలు పవన్‌ ‌కళ్యాణ్‌ ‌సభలకు వస్తారన్నారు. పాచిపోయిన లడ్డు, దక్షిణభారత దేశానికి జరిగిన అన్యాయంపై పవన్‌ ‌కళ్యాణ్‌ ‌గతంలో మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా చలసాని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్‌ ‌కల్యాణ్‌ ఇద్దరూ కలిసి విభజన హాల కోసం పోరాటం చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తుదివరకు తాము పోరాటం చేస్తామని చలసాని శ్రీనివాస్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply