తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 12 :  తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపిన అన్నకు జీవిత ఖైదీ విధిస్తూ వరంగల్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతమాంబ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కుండే ఐలమ్మకు ఇద్దరు సంతానం. నిందితుడు  రవి (40) గొర్రెలను మేపుతూ జీవిస్తున్నాడు. తమ్ముడు కుమార్ (32) పెయింటర్‌ గా పనిచేస్తున్నారు. తమ్ముడు చెడు వ్యసనాలకు అలవాటై నిత్యం మద్యం సేవిస్తూ తన భార్యను వేధించేవాడు. అది భరించలేక ఆమె అతడి నుంచి విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. నాటి నుంచి కుమార్‌ మద్యం సేవించి ఇంట్లో ఉన్న అమ్మను సోదరుడు రవిని కుటుంబ సభ్యులను బెదిరిస్తూ భౌతికంగా దాడులు చేసేవారు. 2024  ఫిబ్రవరి 3న‌ రాత్రి 8:30 గంటలకు మద్యం సేవించిన కుమార్‌ తన అన్నను కరత్రో దాడి చేశారు.. ఇదే అదను చూసిన తన అన్న గొడ్డలితో తమ్ముడిని మెడ నరికి వేయ‌గా కుమార్‌ అక్కడికక్కడే మరణించారు.  తన తల్లి ఐలమ్మ ఫిర్యాదు మేర‌కు సీఐ కిషన్‌ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ కె.మురళీధర్‌ రావు వాదించారు. కోర్టు లైసన్‌ ఏఎస్‌ఐ కంతటి హరికష్ణ కోర్టు కానిస్టేబుల్‌ నమిండ్ల మహేష్‌ 18 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాద ప్రతివాద‌న‌లు విన్న అనంతరం న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు తో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *