– ఖర్గే, డీకేలకు భట్టి విక్రమార్క ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్-2026కు హాజరుకావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. 
భారత్ సమ్మిట్-2026 కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ అంతర్జాతీయస్థాయి సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని భట్టి విక్రమార్క వారిద్దరిని ప్రత్యేకంగా కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




