చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభం

– ఏకకాలంలో 4.5 లక్షల మందికి కొత్తగా మంజూరు
– 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నూతన లబ్దిదారులకు సొమ్ము చెల్లింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్దిదారులు, వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంపిణీ కార్యక్రమాలు సజావుగా జరిగేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 1,23,625 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయగా తాజాగా మరో 4.5 లక్షల మందికి మంజూరు చేసింది. దీంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య మొత్తం 5,73,625కు చేరింది. ఈ నెల 18 వరకు అన్ని నియోజకవర్గాల్లో మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న నూతన లబ్దిదారులకు పింఛన్ సొమ్మును చెల్లించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను చేపట్టింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *