– ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో
హైదరాబాద్/నాగర్కర్నూల్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో నాగర్కర్నూల్ జిల్లా నీటిపారుదల (ఇరిగేషన్ అండ్ క్యాడ్) శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ) ఆర్.సత్యనారాయణ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. ఉదయం 9:30 గంటల నుంచి పది ప్రత్యేక ఏసీబీ బృందాలు రంగంలోకి దిగి ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. హైదరాబాద్ బైరామల్గూడలోని మాధవరం సెరినిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సత్యనారాయణ నివాసంతోపాటు, నాగర్కర్నూల్లో నూతన డీఈ కార్యాలయం, వనపర్తి జిల్లాలోని ఆయన స్వగ్రామం షాపూర్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సత్యనారాయణ నివాసాలతోపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలు, భూములు, ఇళ్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




