హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌కర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 16 : రాష్ట్రంలో స్వల్పకాల పర్యటనకు గాను శుక్రవారం హైదరాబాద్‌ ‌చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌థన్కర్‌, ఆయన సతీమణి సుదేష్‌ ‌థన్కర్‌లకు శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌లు స్వాగతం పలికారు. అనంతరం, ఉప రాష్ట్రపతి కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *