పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం

సన్మానం చేసి చెక్కులను అందించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  బుధవారంఘనంగా సన్మానించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్‌ ‌సోంలాల్‌ ఉన్నారు. చెక్కులను అందించిన సందర్బంగా ముఖ్యమంత్రికి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *