పోలీసుల అదుపులో వింగ్‌ ‌కమాండర్‌

‌- హనీట్రాప్‌తో లోబర్చుకున్న పాక్‌ ‌మహిళ
– ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

న్యూదిల్లీ, ఆగస్ట్ 8: ‌పాక్‌ ‌కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్‌ఫోర్స్ ‌వింగ్‌ ‌కమాండర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ డియా కథనాల ప్రకారం మే నెలలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం వెనుక భారీ గూఢచర్య నెట్‌వర్క్ ఉం‌దని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్‌ ‌నిఘా ఆఫీసర్లు పన్నిన హనీట్రాప్‌లో వింగ్‌ ‌కమాండర్‌ ‌పడ్డాడని చెప్పాయి. నిందితుడిపై అప్పటికే కొంతకాలంగా నిఘా పెట్టి ఆపై పోలీసులకు సమాచారం అందించామని ఎయిర్‌ఫోర్స్ ‌ప్రతినిధి తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వింగ్‌ ‌కమాండర్‌ ‌హనీట్రాప్‌లో పడ్డట్టు పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. సోషల్ ‌మీడియాలో పరిచయమైన ఒక మహిళ అతడి పరిస్థితిని ఆసరాగా చేసుకుని గుఢచర్యానికి ఉసిగొల్పింది. ’చాటింగ్‌తో వాళ్ల పరిచయం మొదలైంది. ఆ తరువాత వీడియో కాల్స్ ‌చేసుకున్నారు. అతడికి నమ్మకం కలిగించాక ఆమె మిలిటరీ కదలికల సమాచారం, ఫొటోలను కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహిళ కోరిక మేరకు కీలకమైన సమాచారం, డాక్యుమెంట్స్‌ను వింగ్‌ ‌కమాండర్‌ ‌డిజిటల్‌ ‌మాధ్యమాల ద్వారా షేర్‌ ‌చేశాడు. ఆ తరువాత ఆమె సూచనలతో అతడు తన సహోద్యోగి ఫోన్‌లో స్పైవేర్‌ ‌కూడా ఇన్‌స్టాల్‌ ‌చేశాడు. రిమోట్‌గా డివైజ్‌లోని సమాచారాన్ని తస్కరించేందుకు, లోకేషన్‌ ‌డేటాను తెలుసుకునేందుకు, ఫోన్‌ ‌కాల్స్‌ను వినేలా స్పైవేర్‌ను డిజైన్‌ ‌చేశారు. పాక్‌లోని హ్యాండ్లర్ల సూచనల ప్రకారం మహిళ ఆ వింగ్‌ ‌కమాండర్‌ను ఉచ్చులోకి దింపినట్టు గుర్తించారు. ఇక శత్రుమూకలకు చేరిన సమాచారంతో ముప్పు ఎంత ఉందనేది విశ్లేషిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ రంగానికి చెందిన సీక్రెట్‌ ‌సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉద్దేశించిన పాక్‌ ‌నిఘా నెట్‌వర్క్‌లో మహిళ భాగమైన ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళకు మార్గనిర్దేశనం చేస్తున్న విదేశీ హ్యాండర్లు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *