మృతదేహాన్ని కాశీ తీసుకెళ్తుండ‌గా ప్రమాదం

– ఏడుగురి మృతి.. 12మందికి గాయాలు
రాంచీ, నవంబర్ 9 : కాశీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఝార్ఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గిరిదిహ్ నుండి వారణాసికి ఒక జీపులో మృతదేహాన్ని తీసుకుని వెళ్తుండగా హజారీబాగ్ జిల్లా చౌపారన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనువా లోయ వద్ద ప్రమాదం జరిగింది. గిరిదిహ్ జిల్లా బగోదర్ బ్లాక్‌లోని బిహారో గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు, వారి బంధువులు, పరిచయస్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఆదివారం మరణించిన కుంజో ప్రజాపతి(90) కుమారుడు రాజు పండిట్, కోడలు బుధ్ని దేవి, అల్లుడు ధోకల్ పండిట్, బావమరిది రామేశ్వర్ పండిట్, పొరుగున ఉండే రామ్‌కిషన్ మండల్ ఉన్నారు. దనువా లోయలోని మహానెతాండ్ మలుపు వద్ద వాహనం పైకప్పుపై కట్టిన మృతదేహం తాళ్లు వదులవ్వగా సరిచేయడానికి వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. అదే సమయంలో వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ఆ వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఐదుగురు దుర్మరణం చెందారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ట్రైలర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. అదే సమయంలో వెనుక నుండి బొగ్గు లోడుతో వస్తున్న మరో ట్రక్కు కూడా ఆ వాహనాన్ని ఢీకొని లోయలోకి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. వారణాసిలో తన అంత్యక్రియలు జరగాలని ప్రజాపతి చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చేందుకు ఆయన పార్థివ దేహాన్ని కుటుంబీకులు వారణాసికి తరలిస్తున్నట్లు బాధితులు తెలిపారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *