పేద బ్రాహ్మణుల అభ్యున్నతే ధ్యేయం

– స్వార్థంతో సమాజంలో విభేదాలు సృష్టించొద్దు
– తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో ఆపాదించొద్దు
-పేద బ్రాహ్మణులకు మూడువేల నివాస గృహాల ప్రతిపాదన
– ‘బాస్’ స్టీరింగ్ కమిటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: వ్యక్తిగత స్వార్థం కోసం సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను స హించబోమని, పేద బ్రాహ్మణుల అభ్యున్నతే తమ ధ్యేయమని, తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో ఆపాదించవద్దని బ్రాహ్మిణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) స్పష్టం చేసింది. ‘బాస్’ స్టీరింగ్ కమిటీ స‌మావేశం నాగోల్లో శ‌నివారం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 500-600 మంది బ్రాహ్మణులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (టీబీఎస్ పీ) చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. శ్రీనివాస్ టీబీఎస్పీ చైర్మన్ గా నియమితులైన అనంతరం ‘బాస్’ సంస్థాగత వ్యవహారాలను స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. రాజకీయాలకతీతంగా పేద, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేయడమే ‘బాస్’  ప్రధాన లక్ష్యమని స్టీరింగ్ కమిటీ తెలిపింది. పేద బ్రాహ్మణ కుటుంబాలకు విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, గృహ వసతి వంటి అంశాల్లో సాధ్యమైనంత సహకారం అందించేందుకు బాస్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొంది. దుదిళ్ల శ్రీపాదరావు అగ్రహారం పేరుతో పేద బ్రాహ్మణుల కోసం సుమారు 3,000 నివాస గృహాలను నిర్మించే ప్రతిపాదనను స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించారు. అన్ని మౌలిక వసతులతోపాటు గేటెడ్ కమ్యూనిటీ తరహా సౌకర్యాలను కల్పించి, సాధ్యమైనంత వరకు నిర్మాణ వ్యయానికే గృహాలను అందించడం ద్వారా పేద బ్రాహ్మణ కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమాజంలో ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను విమర్శిస్తూ బ్లాక్  యిలకు పాల్పడే ప్రయత్నాలు చేయడం దురదృష్టక రమని బాస్ స్టీరింగ్ కమిటీ పేర్కొంది. తెలంగాణ బ్రా హ్మణ సమాజం విస్తృతంగా టీబీఎస్ బీ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం బ్రాహ్మణుల మధ్య ప్రాంతీయ, వ్యక్తిగత విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదని తెలిపింది. సమాజా న్ని విభజించి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని చూసే ధోరణులను బ్రాహ్మణ సమాజం అప్రమత్తంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. అయితే విభేదాలను మరింత పెంచడం ‘బాస్’ లక్ష్యం కాదని, విమర్శలు చేస్తున్న వారు సైతం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి సమాజ అభ్యున్నతికి నిర్మాణాత్మకంగా పనిచేయాలని స్టీరింగ్ కమిటీ హితవు పలికింది. తెలంగాణ ఉద్యమాన్ని ఒక కులానికి లేదా ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసి చూపించడం సరికాదని కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. సబ్బండ వర్గాలు ఉద్యమంలో భాగస్వాము లయ్యాయి. అలాంటి ప్రజా ఉద్యమాన్ని ఒకే కులానికి ఆపా దించి, ఇతర వర్గాలను తెలంగాణ భావజాలానికి లేదా బ్రాహ్మణ సమాజానికి దూరం చేసే ప్రయత్నాలు చేయవద్దు అని కోరింది. బ్రాహ్మణ సమాజం సంప్రదాయంగా సర్వేజనా సుఖినో భవంతు అనే విశాలమైన మానవతా భావనను విశ్వసిస్తుందని, ఇతర వర్గాలను దూరం చేయ డం కాకుండా అందరి సంక్షేమాన్ని కోరుతూ సమాజానికి సేవ చేయడమే బ్రాహ్మణ ధర్మమని ‘బాస్’ పేర్కొంది.
బ్రాహ్మణ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎండోమెంట్ పరిధిలోని అన్ని దే వాలయాల పాలకమండళ్లలో బ్రాహ్మణులకు తగిన ప్రాతిని ధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే లేదా ఇన్చార్జి మంత్రి సిఫారసుతో బ్రాహ్మణ సమాజం నుంచి ఒక కోఆర్డి నేటర్ను నియమించాలని టీబీఎస్పీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న బ్రాహ్మణ కులగణనలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం తప్పని సరిగా నమోదు చేసుకోవాలని స్టీరింగ్ కమిటీ విజ్ఞప్తి చేసింది. బ్రాహ్మణ సమాజంలో యువత ప్రాతినిధ్యాన్ని పెంచడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యం గా సెప్టెంబర్ 6న బాస్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా బ్రాహ్మణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బాస్ స్టీరింగ్ కమిటీ పిలుపు నిచ్చింది. “బ్రాహ్మణ సమాజాన్ని చీల్చడం కాదు కలపడం మా లక్ష్యం. వ్యక్తిగత ప్రయోజనాలు కాదు సమాజ ప్రయో జనమే మా ప్రాధాన్యం. విమర్శలు కాదు నిర్మాణాత్మక సేవే మా మార్గం అని ‘బాస్’ స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *