నా ఫోన్ ట్యాప్ చేశారు..

– మోదీ నాతో ముఖాముఖి చర్చకు రావాలి
– టెలిప్రాంప్టర్ తెచ్చుకున్నా పర్వాలేదు
– మీకు నచ్చిన జడ్జీని పెట్టుకుని డిబేట్ కు రావాలి
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

న్యూదిల్లీ, నవంబర్ 13: తన ఫోన్ ట్యాప్ అయినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
తనపై నిఘా ఉన్న విషయం ప్రధాని మోదీకి తెలుసు అని పేర్కొన్నారు. మోదీ తనతో ముఖాముఖి చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు. విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరు ఉన్నారో తెలుస్తుందని, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎవరు పాల్గొన్నారో తెలుస్తుందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ అకౌంట్లో రాహుల్ గాంధీ వీడియోను పోస్టు చేసింది. మోదీయే తన ఫోన్ ట్యాప్ చేశారని రాహుల్ పేర్కొన్నారు. తనతో చర్చకు వచ్చే ధైర్యం మోదీకి లేదని, ఆయన స్క్రిప్టు చూసి మాట్లాడుతారని ఆరోపించారు. ఎక్కడైనా పర్వాలేదని, టెలిప్రాంప్టర్ను తీసుకువచ్చి డిబేట్లో పాల్గోవాలని, మీకు నచ్చిన జడ్జీని పెట్టాలని రాహుల్ కోరారు. నిజమైన దేశద్రోహి ఎవరో తెలియాలంటే, చర్చకు రావాల్సిందే అని రాహుల్ అన్నారు. తనతో నేరుగా చర్చలో పాల్గొంటే, పాల్గొంటే, ప్రధాని మోదీ రాజకీయ కెరీర్ ముగుస్తుందని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. మంచితనంతో రాహుల్ తన తలకు వైద్య పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రాహుల్ ఫోన్ ఎవరూ ట్యాప్ చేయరని, అంత ఆసక్తి ఎవరికి లేదని, ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆయన బ్రెయిన్ ఎందుకిలా రోజూ అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *