ఎవరు కౌన్‌ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

  “ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..? ” 
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య సవాళ్ల పర్వం తారా స్థాయికి చేరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్‌, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయాధిపత్యం కోసం ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేసేందుకు ఎత్తుల కత్తులకు పదును పెట్టుతున్నారు. అయితే పార్టీల సవాళ్ల రాజకీయంలో ప్రజల అసలు సమస్యలు పక్కదారి పట్టుతున్నాయి. ఎప్పుడో రెండున్నరేళ్ల తర్వాత జరిగాల్సిన చర్చ ఇప్పుడే పార్టీలు పెట్టడంతో ప్రస్తుతం ప్రజలకు కావాల్సిన ప్రాధాన్యత అవసరాలపై చర్చ లేకుండా ఆ సవాళ్ల తుపాన్‌లో కొట్టుకుపోతుంది.
గత వారం రేవంత్‌ రెడ్డి కిషన్‌ రెడ్డి మధ్య సవాళ్ల వార్‌ నడిచింది..బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు మీరే తెలంగాణ ద్రోహులు అంటూ విమర్శలు చేసుకున్నారు. తెలంగాణాభివృద్దికి బీజేపీ అడ్డుకుంటుందని రేవంత్‌ అంటే రాష్ట్రాన్ని రేవంత్‌ విధ్వంసం చేస్తూ ఆర్‌ఆర్‌ టాక్సీ పేరుతో ప్రజలను పీడుస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల దృష్టిని కిషన్‌ రెడ్డిని విలన్‌ చేయాలని రేవంత్‌ చూస్తూ సీఎంను విలన్‌ చేస్తూ  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఎత్తులు వేశారు. ఇద్దరి ఉమ్మడి పెద్దలైన బీజేపీ పెద్దలను కలవడంతో సవాళ్ల యుద్దానికి ఎండ్‌ కార్డ్ పడింది.రేవంత్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డిలు ఇద్దరూ తమకు తామే రాజకీయాధిపత్యం సాధించామని ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రజలను బకరాలను చేశారు.
.తాజాగా తెలంగాణ అప్పులు, సంక్షేమ శాఖలో కోట్ల రూపాయాల అవినీతిపై బీఆర్ఎస్‌ కాంగ్రెస్‌ మధ్య సవాళ్ల పర్వం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. మంత్రులు, బీఆర్ఎస్‌ నేతల మధ్య చాలెంజ్‌లు రాష్ట్రంలో పొలిటికల్‌ సమీకరణలను ఒక్కసారిగా తారుమారు చేశాయి. తెలంగాణ అప్పులపై, టెండర్లలో అవినీతిపై కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ నడిచింది..చర్చకు రెడీ అంటూ సవాళ్లు విసురుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్ రెడ్డి అప్పులపై, రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై, మేనిఫెస్టోలో పెట్టిన హామీలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రభుత్వంపై విమర్శలు, మంత్రుల అవినీతిపై ఆరోపణలు చేశారు.
.అయితే ప్రతిపక్షం చేస్తున్న అప్పులపై చర్చకు సిద్దమని మంత్రులు ప్రకటించారు.బీఆర్ఎస్‌ కూడా ఎన్నికల ముందు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీలపై దిల్‌సుఖ్ నగర్‌, చిక్కడపల్లిలో లేదా రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన వరంగ్‌లో అయిన చర్చ రావాలని కేటీఆర్‌ సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌ ట్రాప్‌లో పడ్డ మంత్రులు పడ్డారు. బీఆర్ఎస్‌ నేతలు ప్రభుత్వ సవాల్‌ ను స్వీకరించరని  ఏకంగా మంత్రి జూపల్లి అప్పులపై చర్చకు తెలంగాణ భవన్‌కే వస్తానంటూ టైం డేట్‌ కూడా చెప్పారు.
.అసలే అకలి మీదున్న పులి నోటికి మంత్రి చిక్కారు. ఇంకేముందు  రాజకీయంగా మంత్రికి, ప్రభుత్వానికి చేయాల్సిన డ్యామేజంతా బీఆర్ఎస్‌ చేసింది. మంత్రి కోసం టీఆర్ఎస్‌ భవన్‌లో కుర్చి కూడా ఏర్పాటు చేశారు.. కేటీఆర్‌ హరీష్‌ రావులు మంత్రి కోసం ముందే భవన్ వచ్చి చర్చకు సిద్దమయ్యారు. మంత్రి హోదాలో తెలంగాణ భవన్‌కు వస్తున్న జూపల్లిని సత్కరించడానికి ఏర్పాటు కూడా చేశారు. అటు సంక్షేమశాఖల్లో జరుగుతున్న ముఖ్యంగా గురుకులాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీన్‌, హరీష్‌ రావుకుల మంత్రులు అడ్లూరి, పొన్నం, అజరుద్దీన్‌ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. సోమాజిగూడలో చర్చకు బీఆర్ఎస్‌ రెడీ అయితే మంత్రులు గన్‌ పార్క్‌కు వెళ్లి హరీష్‌ రావు, కేటీఆర్‌ చర్చలకు రావాలని మంత్రులు సవాల్‌ విసిరారు.
మంత్రుల సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్‌ నేతలు పార్క్‌ వెళ్లేందుకు సిద్దయ్యారు.కానీ ప్రభుత్వం ఆధ్వర్యం నడిచే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని హరీష్‌ రావు సహా మాజీ మంత్రులు గన్‌ పార్క్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. విచిత్రం ఏంటంటే గన్‌ పార్క్‌కు రావాలని సవాల్‌ చేసింది మంత్రులే, మళ్లీ తమ పోలీసులతో అడ్డుకునే మంత్రులే..పైగా బీఆర్ఎస్‌ నేతలు రాకుండా పోసులు అరెస్ట్‌ చేశారని జర్నలిస్ట్‌లు మంత్రులను అడిగితే అది ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు. కనీసం పోలీసులు ప్రభుత్వం ఆదేశలతో పని చేస్తుందన్న అవగాహన కూడా మంత్రులకు లేదు.. పోలీసుల మంత్రి ముఖ్యమంత్రి ఒక్కరే కదా, జూబ్లిహిల్స్‌ ప్యాలేస్‌ షాడో ప్రభుత్వం ఆదేశాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఏలా పాటిస్తుంది. ఆ విషయం మంత్రులు చెప్పకనే చెప్పారు.
మరోవైపు తెలంగాణ భవన్‌కు వస్తానని సవాల్‌ చేసిన మంత్రి జూపల్లి మాట మార్చి గన్‌ పార్క్‌కు రావాలంటూ కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు.జూపల్లి సవాల్‌ స్వీకరించిన కేటీఆర్‌ గన్‌ పార్క్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తే మళ్లీ పోలీసులను ప్రభుత్వం అడ్డుకున్నారు.పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్‌ను నేతలను అడ్డుకోవడమే కాకుండా బీఆర్ఎస్‌ చర్చకు రావడం లేదంటూ మంత్రులు మాట మార్చారు. తెలంగాణ సమాజం మొత్తం చూసింది. సవాల్‌ ఎవరు విసిరారు.గన్‌పార్క్‌కు పోయి చర్చకు రావాలని డిమాండ్ చేశారు.చర్చకు గన్‌ పార్క్‌కు వస్తున్న బీఆర్ఎస్‌ నేతలను ఏ ప్రభుత్వం ఆధ్వర్యం నడిచే పోలీసులు అరెస్ట్‌ చేశారో మొత్తం ప్రజలు గమనించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం బీఆర్ఎస్‌ ట్రాప్‌లో పడుతోంది. రెండు లక్షల రుణమాఫీపై హరీష్‌ రావు సవాల్‌ నుంచి ఇవాళ గన్‌ పార్క్‌లో ,తెలంగాణ భవన్‌లో చర్చకు సవాల్‌ విసిరిన మంత్రుల వరకూ, గతంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో చర్చకు సవాల్‌ చేసిన రేవంత్‌ రెడ్డి  ప్రతీసారీ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడుతోంది. కాంగ్రెస్‌కు సవాల్‌ విసరడం  సవాల్‌ను స్వీకరించకుండా పారిపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.సరుకు లేక, బీఆర్ఎస్‌ ఆరోపణలు ఎదుర్కొలే హస్తం పార్టీ ప్రతీసారి ఓటని పరోక్షంగా అంగీకరిస్తుందన్న చర్చ జనాల్లో జరుగుతుంది. ప్రభుత్వంలో తప్పులు జరక్కపోతే, అవినీతి లేకపోతే మంత్రులు చర్చకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని, చర్చకు వచ్చే ప్రతిపక్షాలను ఎందుకు పోలీసులతో అడ్డుకుంటున్నారన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతుంది.
మరోవైపు సవాళ్ల రాజకీయాలు ఎలా ఉన్నా గన్‌ పార్క్‌ దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు, అవినీతిపై వస్తున్న ఆరోపణలపై ఎవరో కౌన్‌ కిస్క అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని మంత్రి ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడారు.నిజానికి తెలంగాణలో ప్రజా పక్ష మీడియా ఉంటే మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగేది..కానీ రాష్ట్రంలో ఉన్నది గాంధీ భవన్‌ మీడియా, రేవంత్‌ బానిస మీడియా కద..రేవంత్‌ను, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని భుజాలపై మోస్తున్న మీడియా బోయిల్లా వ్యవహరిస్తుంది.అందుకే మంత్రి వ్యాఖ్యలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగం విరుద్దం. ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహస్యం చేసేవే. మంత్రి పొన్నం ప్రభాకర్ సాధారణ పౌరుడు కాదు, ప్రభుత్వంలో కీలక బాధ్యుడు.వ్యక్తిగతంగా తనపై ఏవరో వ్యక్తిగత విమర్శలు చేస్తే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పొన్నం ప్రభాకర్‌ ప్రజా జీవితంలో ఉన్నారు. అందులోనూ బాధ్యత గల ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు.అలాంటప్పుడు ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది.
అయితే ఈ సందర్భంగా మంత్రి ఎవరు పడితే వాళ్లు, తాడు బొంగరం లేని వ్యక్తులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని, సమాధానం చెప్పాలని రాజ్యంగంలో లేదని, సమాధానం చెప్పుతామని రాజ్యంగంపై ప్రమాణం చేయలేదని ప్రకటించారు. ఇది చాలా దారుణమైన ప్రకటన.రాజ్యాంగ విరుద్ద, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రకటన.ప్రమాణ పత్రం చదివే ఓపిక మంత్రులకు ప్రజా ప్రతినిధులకు ఉండదు.అందుకే ఇలాంటి వ్యాఖ్యలు మంత్రులు చేస్తారు.
మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సాధారణ తెలంగాణ పౌరులు ప్రభుత్వం చేసే అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా.?.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు అడుగుతూనే సమాధానం చెప్పాలని మీరు ప్రమాణం చేసిన రాజ్యాంగంలో ఉందా.?. ప్రతిపక్షాలు, ప్రజలు అడిగితే సమాధానం చెప్పరా..?.పైగా కౌన్ కిస్కా అంటు సంబోధిస్తారా.?.
ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజల కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?.దేశంలో ఉన్నది ఒక్కటే రాజ్యాంగం.ప్రధాని నుంచి సాధారణ పౌరుడి వరకూ ఉన్నది ఒకే రాజ్యంగం.ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?..దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి   ఆ విధంగా ప్రమాణం చేయలేదు అని ప్రకటించడం సిగ్గుచేటు. మినిస్టర్ పొన్నం ప్రభాకర్  మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి.అది చట్టంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. మంత్రులు సీఎం లు ప్రధాని సహా ప్రజలకు జవాబుదారీ అని క్లీయర్ రాజ్యాంగంలో ఉంది.ప్రభుత్వం లో అవినీతి అనేది రాష్ట్ర దేశ రహస్యం కాదు.సమాధానం చెప్పం కౌన్ కిస్క అంటే ప్రజలు కూడా అదే విధంగా సమాధానం చెపుతారు.
రాజ్యాంగ పీఠికలో ఏం రాసిందో ఒకసారి చదువు మంత్రిగారు.భారత దేశ పౌరులమైన మేము అని స్పష్టంగా ఉంటుంది.ఆ రాజ్యంగం మీద ప్రమాణం చేసే కదా మంత్రిగా ప్రజా ప్రతినిధిగా ప్రమాణం చేసింది. రాజ్యాంగానికి లోబడే పాలన చేయాల్సింది. మరీ ఆ రాజ్యాంగాన్ని రాసుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కౌన్‌ కిస్క అంటారా..?.ఇది కాంగ్రెస్‌ ప్రజాపాలన ఎజెండానా..ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగ బద్ద పాలన అంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లంత కౌన్‌ కిస్క అని చెప్పడమేనా మిస్టర్‌ మినిస్టర్‌ పొన్నం ప్రభాకర్‌ గారు.?
దేశంలో ప్రజలు గొప్ప, పాలకులు గొప్పా అంటే ఖచ్చింతంగా ప్రజలే గొప్పా.ప్రజలకు పాలకులు జవాబుదారీగా ఉండాలి.ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకునేదే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రజలు రాసుకున్న రాజ్యాంగ బద్దంగా పాలన చేయడమే పాలకులని పని.అంతేకానీ మేము  ప్రజలకు సమాధానం చెప్పం.ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జవాబుదారీ అంటే ప్రజలు కర్రుకాచి వాతపెట్టుతారు. ప్రజల తీర్పు  మించింది ప్రజాస్వామ్యం రాజకీయ వ్యవస్థలో మరోకటి లేదు. చట్ట సభలతో పాటు ప్రజా క్షేత్రంలో చర్చలు జరగాలి, ప్రజల ప్రశ్ని ప్రశ్నకు ప్రభుత్వాలు, మంత్రలు సమాధానం చెప్పాలి.
అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట పొదుపుగా ఓపికతో మాట్లాడాలి.అధికారం ఉంది కదా, పవర్‌లో ఉన్నాం ఏదీ పడితే అది, ప్రజలను ఎలా పడితే అలా అంటామంటే ప్రజలు సరైన సమాధానం చెప్పుతారు.సీఎం అయినా పీఎం అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైన ప్రజలకు సేవకులు మాత్రమే. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. పాలకులు రాజ్యాంగానికి అంతిమంగా ప్రజలకు జవాబుదారులే..
-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *