కులగణనలో పాల్గొనని వారు మళ్లీ వివరాలివ్వొచ్చు
తప్పుడు వార్తల వ్యాప్తి చేయడం బలహీన వర్గాలపై దాడే
వివరాలకు వొచ్చిన అధికారులపై కుక్కలను వొదిలారు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో 96 శాతం సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేశామని, సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గాంధీభవన్ లో ఆయన డియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హా మేరకు అన్ని వర్గాలకు ఫలాలు అందాలనే ఉన్నత లక్ష్యంతోనే కులగణన సర్వే చేశామని చెప్పారు. సర్వేకు వెళ్లిన అధికారులపైకి కుక్కలను వొదిలారని, సర్వే సజావుగా సాగనీయకుండా అనేక అడ్డంకులు సృష్టించారని పొన్నం గుర్తు చేశారు. అప్పుడు సర్వేల్లో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.
కులగణన సర్వేపై తప్పుడు వార్తలను వ్యాపింపజేయడం అంటే అది బలహీన వర్గాలపై దాడే అవుతుందని చెప్పారు. ప్రతిపక్షాల అడ్డంకులను ఎదుర్కొంటామని మంత్రి చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కులగణన సమస్యను పరిష్కరించామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతి రాజకీయ పార్టీ స్టాండ్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన సర్వే చేపట్టిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఆ వివరాలను బయటపెట్టలేదని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశార. పదేండ్ల పాటు సమాచారాన్ని దాచిన ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో కవిత మాత్రమే వివరాలు ఇచ్చారని చెప్పారు. మిగతా ఎవరూ తమ వివరాలను సర్వే అధికారులకు వెల్లడించలేదని చెప్పారు.