ప్రభుత్వానికి తెలియకుండానే సర్కులర్ జారీ చేశారనడం హాస్యాస్పదం

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 22 : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయొద్దంటూ వైస్ ఛాన్స్ లర్ ఇచ్చిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలంటూ ఓయూ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి పోలీసులు విద్యార్థులను బెదిరిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ కు మద్దతుగా అన్ని పౌరసంస్థలు, మేధావులతో పాటు
పూర్వ విప్లవ విద్యార్థులలందరూ కలసి శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.
ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు, సీపీఐ ఎమ్ఎల్ఏ కూనంనేని సాంభశివరావు, సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ, ప్రొఫెసర్ కోదండరాం, సుదర్షన్ రెడ్డి, మాడభూషి శ్రీధర్తో సహా పలువురు మేధావులు జర్నలిస్టు సంఘాల, హక్కుల సంఘాల నాయకులు పాల్గొని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వానికి తెలియకుండా సర్కులేషన్ విడుదలైందంటూ మాట్లాడడం సూచనీయమని వెంటనే ఈ సర్కులేషన్ను రద్దుచేసి శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుర్తు లేకుండా సర్కులర్ జారీ చేశారన్నడం హాస్యాస్పదమని యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులపై పోలీసుల పెత్తనం ఎప్పటికీ ఉండొద్దని ప్రజా పాలన ప్రభుత్వం స్వేచ్ఛకు నిదర్శనం అంటూనే నియంత పాలన చేయడం సబాబు కాదని వక్తలు అభిప్రాయాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *