సుద్దాలకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

– మరో ప్రతిష్ఠాత్మక గౌరవం
– ఈనెల 22న కరీంనగర్‌లో ప్రదానం

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, జాతీయ స్థాయి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ ‌తేజకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం-2026కు ఆయనను ఎంపిక చేశారు. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా ప్రదానం చేస్తున్న ఈ రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈసారి సుద్దాల అశోక్‌ ‌తేజను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. పురస్కార కమిటీ ఛైర్మన్‌, అవార్డు వ్యవస్థాపకుడు కెప్టెన్‌ ‌డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. తెలుగు భాష, సాహిత్యానికి విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి గౌరవించాలనే ఉద్దేశంతో తెలంగాణ తెలుగు తేజం పురస్కారాన్ని ఏటా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కవిగా, సినీ గేయ రచయితగా సుద్దాల అశోక్‌ ‌తేజ తెలుగు భాషకు విశిష్టమైన సేవలు అందిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే సాహిత్య, సినీ రచనలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కార ప్రదానోత్సవాన్ని ఈ నెల 22వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌ ‌తేజకు పురస్కారాన్ని అందజేయనున్నారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టిబిడ్డలు అందించిన అవ•ల్యమైన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పురస్కార కమిటీ ప్రతినిధులు తెలిపారు. భాషా పరిరక్షణ, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న రచయితలు, కవులు, సాహితీవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ పురస్కారాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సుద్దాల అశోక్‌ ‌తేజ తెలుగు సాహిత్యంతో పాటు సినీ గేయ రచయితగా కూడా తనదైన ముద్ర వేశారు. సామాజిక అంశాలు, తెలంగాణ జీవన విధానం, ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించే అనేక రచనలకు ఆయన కలం అందించారు. ఆయన సాహిత్య, సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ తెలంగాణ తెలుగు తేజం పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్‌లో ఈ నెల 22న జరగనున్న పురస్కార ప్రదానోత్సవంతో సుద్దాల అశోక్‌ ‌తేజకు ఈ గౌరవం అధికారికంగా అందనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *