“1912లో మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండలో, శ్రీనివాసశర్మ, సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలను స్థాపించి, తెలుగు భాషలో ‘హితబోధిని’ అనే పత్రికను ప్రచురించాడు. ఇదే మొట్టమొదటి తెలంగాణా తెలుగు పత్రిక. ఈ పత్రికకు ఐదువందల మంది చందాదారులు ఉండేవారు.”
‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అన్నాడు దాశరథి. అటువంటి నిజాం బూజు వదిలించడానికి జరిగిన కృషిలో పత్రికలు నిర్వహించిన పాత్ర అమోఘమైనది. ఈ పత్రికలు ఆనాడు తెలంగాణాలో సాంస్కృతిక పునరుజ్జీవనం సంభవించడానికి ముఖ్యకారణం అయ్యాయి. ఆనాటి నిజాం రాష్ట్రంలో తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఇంగ్లీషు, కన్నడ, బంజారా, గైండీ, గుజరాతీ, కైకాడీ, కేయర్, తమిళ, మలయాళ, మార్వాడీ, బెంగాలీ, పంజాబీ, యానాది, ఎరుకల, గోండీ, చెంచు, కోయ, అరబిక్, పర్షియన్ భాషలు మాట్లాడేవారు జీవించేవారు. వీటిలో తెలుగు, మరాఠీ, ఉర్దూ భాషలు ముల్కీ భాషలు (దేశీయ)గా చలామణిలో వుండేవి. వీటిలో తెలుగు మాట్లాడేవారు 46 శాతం, మరాఠీ భాష మాట్లాడేవారు 26 శాతం, ఉర్దూ మాట్లాడేవారు 10 శాతం వుండేవారు. అయినా చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంతవరకూ వున్న పారశీక భాష స్థానంలో ఉర్దూ భాషను అధికారభాషగా అమలుచేసి ఉర్దూ భాషను తెలుగు ప్రజలపై రుద్దాలని చూశాడు. విద్యాలయాల్లో ఉర్దూయే మాధ్యమంగా వుండేది. అందుకే ప్రజాకవి కాళోజీ నారాయణరావు ‘తొంబదిలో పది నువ్వును తురక లెక్కది ఎన్నాళ్ళు’ అంటూ ప్రశ్నించాడు.
ఇటువంటి పరిస్థితులలో తెలుగు వారైన మేధావులు గ్రంథ ప్రచురణలు, గ్రంథాలయ స్థాపన, సంఘసంస్కరణోద్యమం, పత్రికలు ప్రారంభించడం వంటి కార్యక్రమాలు ఆరంభించారు. 1912లో మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండలో, శ్రీనివాసశర్మ, సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలను స్థాపించి, తెలుగు భాషలో ‘హితబోధిని’ అనే పత్రికను ప్రచురించాడు. ఇదే మొట్టమొదటి తెలంగాణా తెలుగు పత్రిక. ఈ పత్రికకు ఐదువందల మంది చందాదారులు ఉండేవారు. పత్రికలో సామాజిక, ఆర్థిక, వ్యవసాయిక విషయాలు చర్చింపబడేవి. శ్రీనివాసశర్మ స్వయంగా ఆయుర్వేద వైద్యుడు, వీరలోక నాట్యమండలి ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలలో మునిగిపోవడం వలన రెండు సంవత్సరాల తర్వాత పత్రిక ఆగిపోయింది. 1917లో దివ్యజీవన సమాజానికి చెందిన, వెంకటరావు ‘ఆంధ్రమతము’ అనే మాసపత్రిక ప్రారంభించారు. ఇది గౌలిగూడలోని జగదీశ్వర ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రచురింపబడేది. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానం వివరించే పత్రికే అయినా అప్పుడప్పుడూ రాజకీయ విషయాలు వ్యంగ్యంగా ప్రస్తావించేది.
హైదరాబాదు నుండి కాక తెలంగాణా జిల్లాల నుండి వెలువడిన తెలుగు పత్రికలు రెండూ 1922 సంవత్సరంలో ఆగస్టు నెలలో నాలుగు రోజుల వ్యత్యాసంతో ప్రారంభమైనాయి. 1922 ఆగస్టు 24న, వెంకటరామ నరసింహారావు సంపాదకత్వంలో ‘నీలగిరి’ అనే వారపత్రిక ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటి పూర్తిస్థాయి రాజకీయ పత్రిక. 1922 ఆగస్టు 27న వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి నుండి ‘తెనుగు పత్రిక’ ప్రచురించబడింది. తెనుగు పత్రిక సంపాదకులు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, పారసీ భాషలలో ప్రవీణులు, కవులు, ప్రతిభావంతులైన రచయితలు, వక్తలు. తెనుగు పత్రికకు ఐదువందల మంది చందాదారులు వుండేవారు. గోలకొండ పత్రిక ఆవిర్భవించే వరకూ ఈ పత్రికలు గ్రంథాలయోద్యమాన్ని, ఆంధ్రోద్యమాన్ని బలపరిచాయి. ఒద్దిరాజు సోదరులు విజ్ఞానచంద్రికా ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి అనేక గ్రంథాలను ప్రచురించారు.
“ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా సాగుతున్న ఆంధ్రమహాసభ విశేషాలను, కార్యక్రమాలను, తీర్మానాలను, అధ్యక్షోపన్యాసాలను, తెలంగాణలో ప్రజలకున్న రాజకీయ, సాంఘిక, సాహిత్య సాంస్కృతిక చైతన్యాన్ని ఈ పత్రిక ప్రచురించేది. ఆ రోజుల్లో తెలంగాణ తెలుగు ప్రజలను హేళన చేస్తూ, తెలంగాణలో తెలుగు కవులు వున్నారా? అని సందేహం వెలిబుచ్చితే, కొన్ని వందలమంది తెలంగాణ కవుల కవితలు సేకరించి, ‘గోలకొండ కవుల సంచిక’గా ప్రచురించి తెలంగాణలో కూడా గొప్ప కవులు ఉన్నారని చాటారు.”
1923లో వరంగల్ నుండి ముదిగొండ వీరేశలింగశాస్త్రి సంపాదకులుగా ‘శైవప్రచారిణి’ అనే మాసపత్రిక ప్రారంభమైంది. కడిమెల రాజలింగారాధ్య అనే శైవమత గురువు ఈ పత్రిక స్థాపకుడు. ఈ పత్రిక మత పరమైనది అయినప్పటికీ నిజాం ప్రభుత్వ మత దురహంకార విధానాన్ని తీవ్రంగా విమర్శించేది. ఈ రోజుల్లోనే హనుమకొండ హుస్నాబాదులో కొండపాటి అప్పన్నశాస్త్రి ‘హాస్యలత’ అనే పిల్లల పత్రిక నడిపేవారు. మరొక ఆధ్యాత్మిక పత్రిక ‘జైనమతి’ సికింద్రాబాదులోని పంచాక్షరి ప్రెస్ నుండి వెలువడింది. దీని సంపాదకులు బుచ్చయ్య లింగయ్యశాస్త్రి.
1925లో అర్ధవార పత్రికగా ‘నేడు’ అనే పత్రిక భాస్కర్ సంపాదకత్వంలో వెలువడింది. ఇది తెలుగు, ఇంగ్లీషు ద్విభాషా పత్రిక. ఇదే సంవత్సరంలో ప్రముఖ సంఘ సంస్కరణవేత్త భాగ్యరెడ్డి, ‘భాగ్యనగర్’ పత్రిక స్థాపించాడు. సంపాదకుడైన భాగ్యరెడ్డి ఆరోగ్యకారణాల వల్ల మైసూరు వెళ్ళి వుండడం వల్ల పత్రిక మూసివేయబడింది. మైసూరు నుండి తిరిగి వచ్చిన తరువాత హరిజనోద్ధరణ కృషిలో భాగంగా ‘ఆదిహిందూ’ వారపత్రిక ప్రారంభించాడు. ఈ పత్రికలో అనేక రాజకీయాంశాలు చర్చిస్తూ ఆనాటి ప్రజా ఉద్యమాలను బలపరిచే పత్రికగా నిలిచింది.
ఈ పత్రికల తర్వాతనే ‘గోలకొండ పత్రిక’ 1926, మే, 10వ తేదీన ప్రారంభమైంది. అర్ధవారపత్రికగా కొన్నాళ్ళు కొనసాగి, ఆ తర్వాత దినపత్రికగా నలభై సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలలో జాగృతి కలిగిస్తూ ఈ పత్రిక ముందుకు సాగింది. ఆనాటి తెలంగాణ ఉద్యమజీవితాన్ని గోలకొండ పత్రికలో మనం అద్దంలో చూసినట్లు చూడవచ్చు. దీని సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి. గొప్ప పండితుడు ఆంధ్రమహాసభ ప్రథమ సభకు అధ్యక్షుడు. ఈ పత్రిక రాకపోకల సౌకర్యాలు సరిగా లేని మారుమూల గ్రామాలలో కూడా విస్తరించింది. గోలకొండ పత్రిక మొదటి పేజీలో ‘వార్తయందు జగము వర్ధిల్లు చుండును’ అని ముద్రించేవారు. ఇంటింట గ్రామాలనుండి, తాలూకా, జిల్లా కేంద్రాల నుండి వార్తలు వ్రాసి పంపించవలసిందిగా చదువుకున్న వారిని ప్రోత్సహిస్తూ తెలంగాణలో విలేఖరులను సృష్టించిన గౌరవం కూడా ఈ పత్రికకే దక్కుతుంది. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా సాగుతున్న ఆంధ్రమహాసభ విశేషాలను, కార్యక్రమాలను, తీర్మానాలను, అధ్యక్షోపన్యాసాలను, తెలంగాణలో ప్రజలకున్న రాజకీయ, సాంఘిక, సాహిత్య సాంస్కృతిక చైతన్యాన్ని ఈ పత్రిక ప్రచురించేది. ఆ రోజుల్లో తెలంగాణ తెలుగు ప్రజలను హేళన చేస్తూ, తెలంగాణలో తెలుగు కవులు వున్నారా? అని సందేహం వెలిబుచ్చితే, కొన్ని వందలమంది తెలంగాణ కవుల కవితలు సేకరించి, ‘గోలకొండ కవుల సంచిక’గా ప్రచురించి తెలంగాణలో కూడా గొప్ప కవులు ఉన్నారని చాటారు.
1927లో పి.ఎన్.శర్మ, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలైన ప్రముఖ ఉద్యమనాయకులు, సాహితీవేత్తలు కలిసి సుజాత అనే చక్కటి సాహిత్య మాసపత్రికను నడిపారు. దీని సంపాదకులుగా పి.ఎన్.శర్మ వుండేవారు. కాని మూడు సంవత్సరాలలో ఈ పత్రిక అప్పులలో కూరుకుపోయి, స్థాపకులలో ఒక్కొక్కరికి రెండువందల రూపాయల ఆర్థిక నష్టం కలిగించింది. 1934లో ‘దక్కన్ కేసరి’ తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువడింది. దీని సంపాదకుడు దత్తాత్రేయశర్మ. 1936లో ‘1936’ అను పత్రిక ప్రారంభమైంది. ఇదే సంవత్సరంలో రావుమళ్ళ సత్యవతీదేవి, సికింద్రాబాదు నుండి ‘తెలుగుతల్లి’ అనే మాసపత్రిక ప్రారంభించింది. సికింద్రాబాదు నుండి, ‘విభూతి’ పత్రిక, వీరభద్రశర్మ సంపాదకత్వంలో వెలువడింది. 1937లో దివ్యకూరి అప్పయ్యశాస్త్రి అనే నూతన వాది ‘దివ్యవాణి’ పత్రిక ప్రచురించేవాడు.
“వరంగల్ నుండి దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వంలో ‘శోభ’ పత్రిక వెలువడి ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ ఆర్థిక కారణాలవల్ల ఒక సంవత్సరంలోనే ఆగిపోయింది. 1938 నుండి 1945 వరకు పత్రికలు వెలువడలేదు. వాక్స్వాతంత్ర్యంపై నిజాము విధించిన క్రూర నిర్బంధమే దీనికి కారణం..”
ఇది పూర్తిగా ప్రగతినిరోధక భావాలతో నిండి వుండేది. వరంగల్ నుండి దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వంలో ‘శోభ’ పత్రిక వెలువడి ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ ఆర్థిక కారణాలవల్ల ఒక సంవత్సరంలోనే ఆగిపోయింది. 1938 నుండి 1945 వరకు పత్రికలు వెలువడలేదు. వాక్స్వాతంత్ర్యంపై నిజాము విధించిన క్రూర నిర్బంధమే దీనికి కారణం. అనేక ప్రయత్నాల తరువాత 1945లో పిల్లా సుబ్బారావు కృషి మూలంగా ‘తరణి’ అనే తెలుగు మాసపత్రిక వెలువడింది. ఈ సమయంలోనే కమ్యూనిస్టులు ‘ఆంధ్రకేసరి’ అనే వారపత్రికను వెలువరించారు. సికింద్రాబాదు నుండి ‘దక్కన్ కేసరి’ అనే పత్రిక కూడా వెలువడింది. ఈ పత్రిక నాయుడు సన్ముఖరావు [పేరు అస్పష్టం] నడిపింది. ప్రముఖ ఉర్దూ పత్రిక ‘పయామ్’ సంపాదకుడు ఖాజీ అబ్దుల్ గఫార్ ‘సందేశము’ అనే తెలుగు పత్రికను ప్రారంభించాడు. కాని ఈ పత్రిక ఆరునెలలపాటు మాత్రమే నడిచింది. 1945లోనే ‘మీజాన్’, ‘తెలంగాణా’ పత్రికలు ప్రారంభమయ్యాయి. తెలంగాణా పత్రికకు రాజగోపాల ముదలియార్, మీజాన్ పత్రికకు కలకత్తావాలాలు ఆర్థిక సహాయం చేసినారు. మీజాన్ పత్రిక అడవి బాపిరాజు సంపాదకత్వంలో నిజాం అనుకూల పత్రికగా నిలిచింది. తెలంగాణా పత్రిక బి.ఎస్.శర్మ సంపాదకత్వంలో జాతీయ ఉద్యమాన్ని నిజాం వ్యతిరేక ఉద్యమాలను బలపరుస్తూ వ్రాసింది.
ఈ సమయంలో తెలుగు పత్రిక కానప్పటికీ తెలుగు ప్రముఖుడి సంపాదకత్వంలో వెలువడిన రయ్యత్ పత్రిక చాలా ప్రముఖమైంది. దీని సంపాదకుడు మందుముల నరసింగరావు. ప్రభుత్వ విధానాలను విమర్శించడంలో జంకకుండా ధైర్యంగా ప్రజల పక్షాన పోరాడిన గౌరవం రయ్యత్ ఉర్దూ పత్రికకు చెందుతుంది. మందుముల నరసింగరావు ఉత్తమశ్రేణికి చెందిన ఉర్దూ విద్వాంసుడు. జాతీయవాది. దేశ స్వాతంత్ర్యము ప్రజాస్వామ్యము కావాలనుకునే వారందరూ భాష, మతము, వయసులో సంబంధం లేకుండా నరసింగరావు గారి దగ్గరకు వెళుతుండేవారు. రయ్యత్ పత్రిక సంపాదకీయాలు, ఏ విషయాన్నైనా కూలంకషంగా చర్చిస్తూ సుదీర్ఘంగా వుండేవి. ఈ పత్రికను ఆపివేయడానికి ప్రభుత్వం, మజ్లిస్ పార్టీవారు తీవ్రంగా కృషి చేశారు. రయ్యత్ పత్రిక
చదివేవారి మీద కూడా నిఘా వుండేది. మతోన్మాదులు బీదరులో హిందూ వ్యాపారస్తుల దుకాణాలు, ఇండ్లు దహనం చేసినప్పుడు ‘బీదర్ దహన్’ అనే శీర్షికన, ఆ తర్వాత బీబీనగర్లో దురంతం జరిగినప్పుడు వ్రాసిన ‘అలీనగర్ సే బీబీనగర్ తక్’ సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని వణికించాయి. రయ్యత్ పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేసే షోయబుల్లాఖాన్, రయ్యత్ పత్రికను ప్రభుత్వం నిషేధించిన తరువాత ఇంరోజ్ (ఈనాడు) అనే పత్రికను జాతీయవాద దృక్పథంతో నడిపి వాస్తవాలను నిర్భయముగా వ్రాసేవాడు. రజాకారు మూకలు ఇది సహించక అతని ఇంటి ముందే అతని తలనరికి హత్యచేశారు. ఒక చెయ్యి నరికి ఖాశిం రజ్వీకి కానుకగా పంపినారు. ఈ విధంగా ఇంరోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లాఖాన్ మొదటి జర్నలిస్టు అమరవీరుడుగా నిలిచాడు.
ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని సమర్థిస్తూ పనిచేసే ‘దక్కన్ న్యూస్’ పత్రికకు వ్యతిరేకంగా ముస్తఫాఖాదిరీ అనే జాతీయవాది వతన్ న్యూస్ అనే వార్తాసంస్థను ‘ముహబ్బె వతన్’ అనే పత్రికను స్థాపించినాడు. అదే విధంగా గణపతిరావు ‘మోడరన్ న్యూస్’ ప్రేమ్‌కుమార్ ‘మసావత్’ అనే పత్రికలు ప్రచురించి తమ వ్యాసాల ద్వారా సంచలనాలు సృష్టించారు. హనుమకొండ నుండి సీతారామశర్మ సంపాదకునిగా ‘ఆంధ్రాభ్యుదయం’, మెదక్ జిల్లా, తూప్రాన్ సమీపంలోని వడ్డేపల్లి నుండి ‘దేశబంధు’ వంటి ఉత్తమశ్రేణికి చెందిన రాజకీయ పత్రికలు వెలువడినవి. ప్రముఖ ఆర్యసమాజ నాయకులు వామన్ నాయక్, కేశవరావులు కలిసి 1920లో ‘నిజామ్ విజయ్’ హిందీ పత్రికను ప్రారంభించారు. 1929 ఆగస్టులో ఈ పత్రిక నిషేధించబడింది. వెంటనే వీరు ‘లోక్ వీక్షణ’, ‘నాగరిక్’ ప్రారంభించారు. ఆ తరువాత నాగరిక్ కూడా నిషేధించబడింది. 1930లో ‘నిజాం విజయ్’ తిరిగి ప్రారంభించబడింది. సయ్యద్ అబ్బుల్లా ‘న్యూ ఎరా’ అనే ఇంగ్లీషు పత్రిక ప్రారంభించిన వెంటనే నిషేధించబడింది. అతను వెంటనే 1931 ఆగస్టు 10న ‘హైదరాబాదు హెరాల్డ్’ పత్రిక స్థాపించి లోపభూయిష్టమైన నిజాం ప్రభుత్వ వ్యవహారాల్ని విమర్శిం[చిత్రంలో ఇక్కడ మొదటి కాలమ్ చివరి పంక్తి కత్తిరించబడింది] వంటి పత్రికలు రాచరికాన్ని సమర్థించేవి. ‘పయామ్’, ‘రహబీర్ ఇ–దక్కన్’, ‘రయ్యత్’, ‘ఇంరోజ్’ పత్రికలు ప్రభుత్వ మత దురహంకార, ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా విమర్శించేవి.
ఇవే కాక ‘హైదరాబాదు బులెటిన్’, ‘దక్కన్ క్రానికల్’, ‘ద డెయిలీ న్యూస్’ మొదలైన ఇంగ్లీషు పత్రికలు చదువుకున్న విద్యావంతులను ప్రభావితం చేశాయి. ఆంధ్రోద్యమ పితామహుడు మాడపాటి హనుమంతరావు ముషీర్ దక్కన్ పత్రికలో వ్యాసాలు వ్రాస్తుండేవాడు. ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక విలేఖరిగా వుండిన ఎల్.డి. నవరాజన్ నిజాం ప్రభుత్వ రాష్ట్ర బహిష్కార శిక్షకు గురయ్యాడు. అసోసియేటెడ్ ప్రెస్ సంపాదకులుగా వుండిన గోపాల కృష్ణన్ను ప్రభుత్వం నిర్బంధించింది. ఈ విధంగా హైదరాబాదు రాష్ట్రం బయటినుండి వెలువడే పత్రికల విలేఖరులుగా పనిచేసేవారు తీవ్ర నిర్బంధానికి గురికాగా షోయబుల్లాఖాన్ వంటి వారు తమ ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది.
ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తరువాత స్టేట్ కాంగ్రెస్ పత్రికగా వెలువడిన ‘సారథి’ పత్రిక ‘ఓడితే వీరస్వర్గం – జయిస్తే స్వరాజ్యం’ అంటూ ప్రజలను ప్రోత్సహిస్తుండేది. ప్రభుత్వంలో వున్న హయగ్రీవాచారి, బొమ్మకంటి సత్యనారాయణల నేతృత్వంలో తాళ్ళూరి రామానుజ స్వామి సంపాదకత్వంలో విజయవాడ నుండి ఈ పత్రిక వెలువడుతూ వుండేది. డా. మర్రి చెన్నారెడ్డి ‘హైదరాబాదు’ వారపత్రిక సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి ‘తెలుగుదేశం’ వారపత్రికలు కూడా విజయవాడ నుండి వెలువడుతుండేవి. అదే విధంగా అద్దూరి అయోధ్య రామయ్యగారి ‘భాగ్యనగర్’ పత్రిక బి.ఎస్.శర్మ సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్రవాణి’ వంటివి కొన్ని ముఖ్యమైన పత్రికలు, ప్రజా ఉద్యమాన్ని బలపరుస్తూ వుండేవి. ఈ విధంగా సాహిత్య పత్రికలు, మత సంబంధ పత్రికలు తెలుగువారి సాంస్కృతిక సంబంధించిన పత్రికలు, ఆంధ్రభాషను కాపాడడానికి వెలువడిన పత్రికలు, తెలుగువారి ఉద్యమాన్ని బలపరిచే దిశగా సాగి మన జన్మజన్మాల బూజును వదిలించాయి.
చరిత్రశాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం
ఆగస్టు 15, ‘ప్రజాతంత్ర ‘
జయ భారత మాతా
జయ నవ భారత జనమన అభిమత నవ గణ తంత్ర విధాతా
ప్రియ బాంధవ్యము జగతికి చాటిన సద్గుణ సుస్థిర చరితా
జయ జయ నాదము జనగళ రావము పెంచెను నీదు ఘనతా
విశ్వ కవీంద్రుల విజయ గీతములు నింపెను మనసిలో మమతా !జయ!
సప్త గిరీంద్రములు మంచుకొండలు సత్పుర వింధ్య శ్రీశైలములు
తుంగాకృష్ణా యమున పినాకిని గంగా గోదావరి సలిలములు
అయోధ్య రాముడు మధురా కృష్ణుడు అవతరించిన అనుపమ స్థలములు
అనవరతము నీ గుణములు పాడగ అవనిలో నీవే అఖండ ఖ్యాతా. !జయ!
ఆంధ్ర ఉత్కళ ద్రావిడ పరివృత మహారాష్ట్ర గుజరాత్ సేవితా
సస్యశ్యామల సుఫల సుజాతా సత్య అహింసా శాంతి విధాతా
పంజాబ్ సింధు వంగ అసాములు మంజీరములై పారే నదులు
కన్యకుమారి కాశ్మీరములు అమూలకబ్జిని [పదం అస్పష్టం] భారత మాతా !జయ!
— ఎ. వేణుగోపాల్
అసలు పేజీ







