– మొత్తం 5,98,193 దరఖాస్తులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుక” గడువు బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు అందాయి. వీటిలో 3,31,236 వితంతు పెన్షన్లకు, 62,689 ఒంటరి మహిళల పెన్షన్లకు, 1,48,882 దివ్యాంగుల పెన్షన్లకు, 18,005 చేనేత కార్మికుల పెన్షన్లకు, 37,381 గీత కార్మికుల పెన్షన్లకు దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు నిర్ణీత ప్రక్రియ ప్రకారం పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందేలా పారదర్శకంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





