వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడడానికి వెళ్లాడట. తనని చూసి కూడా రాజు ‘ సందడి తీరిన వెన్క’ రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. ముప్పై రెండు రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే మాత్రం దానికి ఏదో పర్యవసానం ఉండితీరుతుంది. కేసీయార్ రాజభవనం ముందు తన భావజాల దండం పట్టుకుని గద్దర్ దీనంగా నిరీక్షిస్తున్న దృశ్యం , తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరచింది. ప్రభుత్వ పతనానికి ఒక ప్రేరకమయింది.
అదే చరిత్ర మళ్లీ మళ్లీ జరుగుతుందంటారు, ఒక్కోసారి ఒక్కోరకంగా. కాస్త ముందువెనుకలుగా, లేదా హెచుత గ్గులుగా. అప్పుడు గుమ్మడి విఠల్ రావు, ఇప్పుడు గుమ్మడి నర్సయ్య. అప్పుడు దళితుడు, ఇప్పుడు ఆదివాసీ. ఇద్దరూ విప్లవనేపథ్యం కలిగినవారే. ఇద్దరికీ జనంలో అభిమానం, గౌరవం ఉన్నాయి. అయినా, ఏలిక దర్శనం దొరకలేదు.
విగ్రహాలు పెట్టి నెత్తికి ఎత్తుకుంటోంది కానీ, గద్దర్ కు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవమానం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గుణపాఠం మాత్రం తీసుకోవడం లేదు. ప్రయత్నిస్తే ప్రధానమంత్రిని అయినా తేలికగానే కలవవచ్చును కానీ నాడు కెసిఆర్ ను, నేడు రేవంత్ ను కలవడం దుస్సాధ్యమని జనం చెప్పుకుంటున్నారు.
పదేళ్లలో బిఆర్‌ఎస్ చేయని పనులు తాము చేస్తున్నామంటారు రేవంత్. వారికీ వీరికీ తేడా లేదు, ఒకేరకంగా వ్యవహరిస్తున్నారంటారు బండి సంజయ్. మేం చాలా గొప్పగా పాలించాము, మాయలో పడిన జనం తమను ఓడిరచారని పాతపాటే పాడతారు కెసిఆర్. భిన్నమయిన పార్టీలయినా అన్నిటి మధ్య తేడాల కంటె పోలికలే ఎక్కువ.
కాంగ్రెస్ పాలన బాగా ఉందా? ప్రజలు పెదవి విరుస్తున్నారా? ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూడడం మొదలయిందా? పొరుగు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సాధారణులు, దిల్లీ నుంచో లేక ఇతర భాషా రాష్ట్రాల నుంచో వచ్చిన విలేఖరులు, రాజకీయాసక్తులు, రేవంత్ ప్రభుత్వం గురించి వేసే ప్రశ్నలు ఇవి. వేళ్లు తెలంగాణ నేలలో బలంగా లేకపోయినా కాంగ్రెస్ అధిష్ఠానంతో ఏదోరకమైన హాట్ లైన్ కలిగినవారు కూడా రేవంత్ రేటింగ్ గురించి తరచు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూటమి పాలన మీద కూడా అటువంటి ఆసక్తే ఇతరులకు ఉంది. బహుశా వినిపించే సమాధానాలు కూడా ఒకేరకంగా ఉంటాయి.
‘‘ఎన్నికలు లేకపోతే రాజకీయమే లేనట్టుగా వ్యవహరించడం పెరిగిపోయింది. కొడితే గట్టిగా కొడతారు కాబట్టి, ఎమ్మెల్సీ ఎన్నికల వంటి చిన్నదెబ్బలకు కెసిఆర్ పూనుకోలేదు. బిజెపితో స్నేహం కోసం ప్రయత్నాలు జరుగతున్నాయన్న వదంతుల నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల అస్త్రసన్యాసానికి అందుకు అనుగుణమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు విజయం వచ్చినా, రేపు ఆ వోటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఇంకా మిగిలే ఉంటుంది. ఒకవేళ బిజెపికి విజయం లభిస్తే, అది కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అవుతుంది. అదే సమయంలో దీర్ఘకాలంలో బిఆర్‌ఎస్ ఉనికికే ముప్పు కూడా.’’
ఇప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోతుం దనేది ఒక ఊహాజనిత అంచనా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రావు. వచ్చినా జనంలోని అసంతృప్తి ఒక నిశ్చయరూపంలో ఉందనీ చెప్పలేము. అధికారపార్టీకి ప్రజానుకూలత పాతాళానికి పడిపోయిందని చెప్పడం ప్రతిపక్షాలకు అవసరం. అయిదేళ్లూ కొనసాగాలని కోరుకుంటాము కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్టార్ హోటళ్లలోనూ ఫామ్ హౌజ్ లలోనూ జరుపుతున్న గుంపు సిటింగ్ లు పర్యవసానం ఎట్లా అయినా ఉండవచ్చునని మెత్తగా బెదిరించడం కూడా ప్రత్యర్థులకు అవసరమే.
నిజానికి ఇప్పుడు ప్రజలకు కొత్త అధికారపార్టీ కంటె చురుకైన ప్రతిపక్షం అవసరం. మొన్నటి ఎన్నికలకు ముందు తెలంగాణ సమాజానికి కొన్ని ఆకాంక్షలున్నాయి. కాంగ్రెస్‌ప్రభుత్వం వాటిని నెరవేరుస్తుందన్న ఆశ ఉండిరది. అవి చాలా వరకు నెరవేరలేదు. కొన్ని నెరవేరాయి. మరి కొన్ని అరకొరగా అందుబాటులోకి వచ్చాయి. కొన్ని అంశాల మీద జనంలో ఆవేశం ఉంది. కొన్నిటి మీద ఇంకా నిరీక్షించే ఓపిక ఉంది, సర్దుబాటూ ఉంది. ఈ స్థితిలో తమ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికల వాగ్దానాలు అమలుచేయించే ప్రతిపక్షం కావాలి. కొత్తగా ముందు కువస్తున్న సమస్యల విషయంలో అండగా ఉండడమూ, ప్రజల నుంచి వస్తున్న ఉద్యమాలకు నైతికంగా మద్దతు ఇవ్వడమూ చేయాలి. ఆ పనులు బిఆర్‌ఎస్ అసలే చేయడం లేదని అనలేము. చేయవలసినంత మాత్రం చేయడం లేదు. చేసినంతవరకు కూడా కేవల రాజకీయ కోణం నుంచే వ్యవహరిస్తోంది తప్ప ప్రజా ప్రయోజనాల దృష్టి నుంచి చేయడం లేదు. ఇక బిజెపి అయితే, ఎందువల్లనో, ప్రజాసమస్యల విషయంలో ఉదాసీనంగా ఉంటోంది. మత పరమైన ఉద్వేగ విషయాలలో చూపిం చేంత చురుకుదగనం వాస్తవ అంశాల మీద చూపడం లేదు. చివరకు బిసి కులగణన అంశంలోనూ ఆ పార్టీది మతకో ణమే. అట్లాగే, బిఆర్‌ఎస్ మీద దూకుడుగా విరుచుకు పడడానికి చూపిన ఉత్సాహం, కాంగ్రెస్‌మీద తీవ్ర విమర్శలకు చూపడం లేదు.
ప్రజాజీవితం, సభా జీవితం అంటే విమర్శ ప్రతివిమర్శలు అనుకున్నట్టే, ఎన్నికలూ ప్రభుత్వాల ఎంపికలూ అంటే వైకుంఠపాళి లాంటి అనూహ్యమైన జూదం అనుకుంటారు. అదృష్టం బాగుంటే కెసిఆర్‌లాంటి నిచ్చెన దొరుకుతుంది. లేకపోతే, రేవంత్ లాంటి పెద్దపాము మింగుతుంది. దురదృష్టం! ప్రజలు తమ చైతన్యంతో, ఎంపికతో వోట్లు వేయరు, ఎవరో మాయలోడు గాయి చేసి గత్తర చేస్తే, జనం మోసపోతారు. 2023 ఓటమికి తాము చేసిన తప్పిదాలు కారణం కాదట, జనం ఎవరి మాయలోనో పడి చేసిన పొరపాటట! బహుశా, ఈ రకమైన కథనాన్ని తెలంగాణ ప్రజలు ఇష్టపడరు. తాము సోయితోనే బిఆర్‌ఎస్ ను ఓడిరచామని వాళ్లు అనుకుంటున్నారు. రేవంత్ అనివార్యమైన ప్రత్యామ్నాయం అయ్యారు తప్ప, ఆయనను ప్రజలు కోరి ఎంచుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తీర్పు ప్రధానంగా బిఆర్‌ఎస్ వ్యతిరేక తీర్పు. రేవంత్ మీద అసంతృప్తి పెరిగితే ప్రత్యామ్నాయం కోసం చూస్తారు నిజమే కానీ, ఆ ప్రత్నామ్నాయం బిఆర్‌ఎస్ కావాలంటే మాత్రం, పదేళ్ల తమ హయాంలో తప్పులో పొరపాట్లో జరిగాయన్న కనీస అంగీకారం అవసరం అవుతుంది. అది కూడా పెద్దాయన నోటి నుంచే రావాలని ఆశిస్తారు.’’
తెలంగాణ జనం కెసిఆర్ కోసం నిరీక్షిస్తున్నమాట నిజమే. కాకపోతే, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆయనను తక్షణం కోరుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే విమర్శించడం బాగుండదు అందుకని కొంత సమయం ఇద్దామని తాను మౌనంగా ఉన్నానని కెసిఆర్ చెప్తారు. సంవత్సరం ప్రొబేషన్ అయిపోయింది కాబట్టి, ఇక ఆయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగవచ్చు. దిగే సూచ నలు ఈ మధ్య ఆయన రెండు సందర్భాలలో చేసిన ప్రసం గాలలో ఉన్నాయి.
ప్రజా జీవితం అంటే ఏమిటో ఈ నాయకులకు ఉండే అభిప్రాయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రతిపక్షం పని కేవలం విమర్శించడమేనా? సానుకూలంగా చేసే పనేమీ ఉండదా? బాగున్నవాటిని ప్రశంసిస్తే, లేని వాటిని ధాటిగా విమర్శించవచ్చు,అధికారపార్టీ మాటలనే అమలు లోకి తేవడా నికి ఒత్తిడి పెట్టవచ్చు, తిట్లు కొన్ని రోజులు అటకె క్కించి ప్రజాసమస్యలకు ప్రాతినిధ్యం వహించవచ్చు.
కొత్త ప్రభుత్వం తన వైఫల్యాలకు పాత ప్రభుత్వానికి బాధ్యత అంటగట్టడం మరో ధోరణి. ఉభయ రాష్ట్రాలలోను కనిపిస్తున్న ఉమ్మడి లక్షణం ఇది. కొంతకాలం వరకు సరే, ఏడాది దాటినా, అదే జరిగితే అది మభ్యపర చడం తప్ప మరొకటి కాదు. ఫలితంగా, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ నిందాపర్వం కొనసాగుతూ, ప్రజా ప్రయోజనాలు, ఆకాంక్షలు అప్రధానమైపోతున్నాయి.
ఎన్నికలు లేకపోతే రాజకీయమే లేనట్టుగా వ్యవహరించడం పెరిగిపోయింది. కొడితే గట్టిగా కొడతారు కాబట్టి, ఎమ్మెల్సీ ఎన్నికల వంటి చిన్నదెబ్బలకు కెసిఆర్ పూనుకోలేదు. బిజెపితో స్నేహం కోసం ప్రయత్నాలు జరుగతున్నాయన్న వదంతుల నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల అస్త్రసన్యాసానికి అందుకు అనుగుణమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు విజయం వచ్చినా, రేపు ఆ వోటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఇంకా మిగిలే ఉంటుంది. ఒకవేళ బిజెపికి విజయం లభిస్తే, అది కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అవుతుంది. అదే సమయంలో దీర్ఘకాలంలో బిఆర్‌ఎస్ ఉనికికే ముప్పు కూడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ లో గెలిచినా, అక్కడ బిజెపి చాపకింద నీరులా బలపడుతున్నదని అర్థం. పైగా, ఆ వోటర్లు ఇక అటే ఉండిపోతారు. ఇక ఫిరాయింపుల విషయంలో రానున్న సుప్రీంకోరు తీర్పు వల్ల ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహల్లో బిఆర్‌ఎస్, బిజెపి ఉంటున్నాయి. మునుగోడు లాంటి మధ్య ంతర ఎన్నికలు వస్తే, రాజకీయ వాతావరణం వేడెక్కిం చవచ్చునని వాటి ఆశ. వేడి వాతావరణం అంటే సమస్యలు కాక, శపథాలు తిట్ల పురాణాలు అన్న మాట.
ఏడాది తరువాత క్రియాశీలంగా రాజకీయవేదిక మీద కనిపించబోతున్న కెసిఆర్ లో ప్రజలు ఏమి చూడాలను కుంటారు? సార్ ఏమైనా మారాడా? మునుపటి లాగానే ఉన్నాడా? ఇటీవలి రెండు సందేశాలలోను, కెసిఆర్ లో చాలా మార్పు కనిపించింది కానీ, జనం కోరుకునే ప్రధానమైన మార్పు మాత్రం అందులో లేదు.
ప్రజాజీవితం, సభా జీవితం అంటే విమర్శ ప్రతి విమర్శలు అనుకున్నట్టే, ఎన్ని కలూ ప్రభుత్వాల ఎంపి కలూ అంటే వైకుంఠపాళి లాంటి అనూహ్యమైన జూదం అను కుంటారు. అదృష్టం బాగు ంటే కెసిఆర్‌లాంటి నిచ్చెన దొరుకుతుంది. లేక పోతే, రేవంత్ లాంటి పెద్దపాము మింగుతుంది. దురదృష్టం! ప్రజలు తమ చైతన్యంతో, ఎంపికతో వోట్లు వేయరు, ఎవరో మాయలోడు గాయి చేసి గత్తర చేస్తే, జనం మోసపోతారు. 2023 ఓటమికి తాము చేసిన తప్పిదాలు కారణం కాదట, జనం ఎవరి మాయలోనో పడి చేసిన పొరపాటట! బహుశా, ఈ రకమైన కథనాన్ని తెలంగాణ ప్రజలు ఇష్టపడరు. తాము సోయితోనే బిఆర్‌ఎస్ ను ఓడిర చామని వాళ్లు అనుకుంటున్నారు. రేవంత్ అనివార్యమైన ప్రత్యామ్నాయం అయ్యారు తప్ప, ఆయనను ప్రజలు కోరి ఎంచుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తీర్పు ప్రధానంగా బిఆర్‌ఎస్ వ్యతిరేక తీర్పు. రేవంత్ మీద అసంతృప్తి పెరిగితే ప్రత్యామ్నాయం కోసం చూస్తారు నిజమే కానీ, ఆ ప్రత్నామ్నాయం బిఆర్‌ఎస్ కావాలంటే మాత్రం, పదేళ్ల తమ హయాంలో తప్పులో పొరపాట్లో జరిగాయన్న కనీస అంగీకారం అవసరం అవుతుంది. అది కూడా పెద్దాయన నోటి నుంచే రావాలని ఆశిస్తారు.
కెసిఆర్ పరిశీలనా శక్తి, వాక్చాతుర్యం ఏమీ తగ్గలేదు. కానీ, మనిషి బలహీనపడ్డారు. ధాటి తగ్గింది. కొంత విజ్ఞాపనా ధోరణిలో మాట్లాడుతున్నారు. కానీ, తన ఉద్యమ జీవితాన్ని, పదేళ్ల పాలనను ఆసరా చేసుకుం టున్నారు. తెలంగాణ ఉద్య మం, అస్తిత్వం, కేంద్రంతో పోరాటం మొదలైనవి ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంతగా ఆయన మాటలలో దొర్లుతు న్నాయి. ఆయన ప్రాంతీయ ఉద్యమ నాయకుడిగా, పార్టీ ప్రాంతీయపార్టీగా జనంలోకి తిరిగి రావాలంటే, ప్రాంతీయ పరిభాష ఎంత అవసరమో, పార్టీపేరును తిరిగి టిఆర్‌ఎస్‌గా మార్చడం అంతే అవసరం.
రజతోత్సవ సందర్భం బిఆర్‌ఎస్ కు ఏడాది పాటు వార్తల్లో ఉండే అవకాశం ఇచ్చింది. తెలంగాణ సమాజం ఎదుర్కొం టున్న సమస్యల గురించి తగినంతగా అధ్యయనం చేస్తున్న దని, అవగాహన పెంచుకున్నదని ఇటీవలి ప్రకటనలు సూచిస్తున్నాయి. కానీ, ఆ అవగాహనను ఉద్యమస్థాయికి తీసుకువెళ్లే నిబద్ధత, సంకల్పం బిఆర్‌ఎస్ కు సాధ్యమా అన్న ప్రశ్న మిగిలే ఉంటుంది. మూడు స్తంభాల తెలంగాణ రాజకీ యంలో ప్రతి రెండు పార్టీలు మూడోపార్టీకి వ్యతిరే కంగా ఏదో రూపంలో కలుస్తున్నాయి. అదే సమయంలో ప్రతి పార్టీకి రాష్ట్రంలో మనుగడ సమస్య ఉన్నది. ఉనికి కోసం ఉద్రేకాలను, అప్రధాన సమస్యలను రెచ్చగొట్టే ధోరణి కూడా ఈ పార్టీలలో ఉన్నది.
తెలంగాణ సమాజం తన మౌలిక విలువలను కాపాడు కుంటూ, ఈ ప్రయాణాన్ని ఎట్లా సాగిస్తుందో చూడాలి. వాగ్దాన భంగాలు ఒక వైపు, గత అనుభవాలు మరొకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, తన విచక్షణను ఎట్లా మిగుల్చుకుంటున్నది పెద్ద ప్రశ్న.
ఈ మూడు స్తంభాల ఆటలో బిఆర్ ఎస్ ఇకపై ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించ లేదు. ఎందుకంటే గత పది సంవత్సరాల వారి తప్పులను ఒప్పుకోకపోవడమే కాక వారిని గద్దె దింపిన ప్రజలను ఇప్పటికీ తప్పు పట్టే ధోరణి నుంచి వారు ఇంకా బయటపడడం లేదు. మరొక అంశం హరీష్ రావు కు ఉన్న నాయకత్వ లక్షణాలు కేటీఆర్ కు లేవు. కానీ హరీష్ రావు ఎప్పటికీ ఆపార్టీ అధినేత కాలేడు. కనుక బీజేపీ చూపు హరీష్ రావు పై ఉంటుంది. ఈ కారణం మరియు లిక్కర్ కేసు, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సతాయించినా ఒక ఆసరా కావాలి కనుక బీఆర్ఎస్ ఇక ముందు బీజేపీ బి టీం గానే ఉంటది. బీజేపీ కూడా ముందు బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ ను మింగి బలపడాలని అనుకుంటుందేమో.