ఈ కైలాసం ఆటలో అన్నీ పాములే, నిచ్చెనలెక్కడ?

వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడడానికి వెళ్లాడట. తనని చూసి కూడా రాజు ‘ సందడి తీరిన వెన్క’ రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. ముప్పై రెండు రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే…