దివ్యాంగులకు సేవ చేయడం గొప్ప విషయం

– మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

మేడ్చ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : స్వయంకృషి సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా 35 సంవ‌త్స‌రాలుగా సేవా దృక్పథంతో దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేయడం అభినందనీయమని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క అన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్‌లో దివ్యాంగుల కోసం సేవలందిస్తున్న స్వయం కృషి సంస్థను ఆమె సోమవారం సందర్శించారు. సంస్థలోని దివ్యాంగులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. దివ్యాంగుల కోసం సంస్థ అందిస్తున్న సేవలు, చేపడుతున్న కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయమంటూ సంస్థ నిర్వాహకులు, ప్రతినిధులను ఆమె అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, దివ్యాంగులకు అండగా నిలవడం, వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం నిజమైన సేవ అని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం, వారి సాధికారత కోసం స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని మంత్రి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *