– కొనుగోలు, ఇన్‌స్టాలేషన్‌పై ఆకర్షణీయమైన ధరలు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సదరన్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైకిన్ ఎక్స్‌క్లూజివ్ సొల్యూషన్ ప్లాజాను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ మురళీధర్ కటారియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గణేష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైకిన్ ప్రతినిధులు మాట్లాడుతూ 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన డైకిన్ సంస్థ 2000 సంవత్సరంలో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి ఎయిర్ కండిషనింగ్ రంగంలో అగ్రగామిగా ఎదిగిందన్నారు. రాజస్థాన్‌లోని నీమ్రానాలో రెండు తయారీ కేంద్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా సహా 45 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. అధునాతన సాంకేతికతతో నాణ్యమైన ఏసీలు, కంప్రెసర్లను తయారు చేస్తున్నట్లు వివరించారు. సదరన్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వర్క్స్ యజమాని సయ్యద్ అలీకి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆయనకు ఏసీ రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. ఈ సొల్యూషన్ ప్లాజాలో స్ప్లిట్, క్యాసెట్, టవర్, డక్టబుల్, వీఆర్వీ ఏసీలతో పాటు డీప్ ఫ్రీజర్ వంటి వివిధ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. వినియోగదారులు షోరూమ్‌ను సందర్శించి ఉత్పత్తుల నాణ్యత, పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించవచ్చన్నారు. కొనుగోలు, సరఫరా, ఇన్‌స్టాలేషన్‌తో పాటు అమ్మకాల అనంతర సేవల్లోనూ ఉత్తమ ధరలు, నాణ్యమైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మెహదీపట్నంలో ప్రధాన బ్రాంచ్ ఉండగా, షంషాబాద్‌లో రెండో బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు గణేష్ రావు తెలిపారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షోరూమ్‌ను సందర్శించి డైకిన్ ఉత్పత్తులను ఆకర్షణీయమైన ధరలకు కొనుగోలు చేయాలని నిర్వాహకులు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





